Weight loss: బరువు తగ్గడానికి పెరుగు ఏవిధంగా సహాయపడుతుంది..

Published : Jul 12, 2022, 04:51 PM IST

Weight loss: పెరుగులో మన శరీరానికి అవసమయ్యే పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటగా.. బరువును కూడా తగ్గిస్తాయి. 

PREV
16
Weight loss: బరువు తగ్గడానికి పెరుగు ఏవిధంగా సహాయపడుతుంది..

పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాదు అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. పెరుగులో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది. దీనినే లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అని కూడా అంటారు. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. దీంతో అజీర్థి వంటి సమస్యలు రావు. 

26

బరువు పెరగడానికి దారితీసే ప్రధాన కారణాల్లో జీర్ణం లేట్ గా అవడం కూడా ఒకటి. దీనివల్లే చాలా మంది బరువు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాగా పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా గట్ సరిగ్గా పనిచేసేందుకు సహాయపడతుంది. దీంతో ఆహారం చాలా తొందరగా జీర్ణం అవుతుంది. 
 

36

పెరుగులో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 1 ఔన్సు పెరుగలో 12 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాను తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఆకలి కూడా తొందరగా కాదు. ఇది మీ కండరాలను బలంగా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కూడా తగ్గిస్తుంది. 

46

పెరుగులో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే మన శరీరంలోని థర్మోజెనిసిన్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. 

56

పెరుగులో పొటాషియం, విటమిన్ బి2 , విటమిన్ బి12, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి  శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. పాలు, పెరుగులో పెరిగే చాలా ఫాస్ట్ గా జీర్ణమవుతుంది. పెరుగును తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

66

బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు చక్కటి ఎంపిక. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇది జీవక్రియ రేటును పెంచుతాయి. ఒక కప్పు పెరుగుతో మీ ఆకలి తీరడంతో పాటుగా మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. పెరుగును మరింత రుచికరంగా తినాలనుకుంటే మీరు దీనికి నట్స్ ను, తాజా ముడి తేనె ను లేదా కూరగాయలను జోడించొచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories