Health Benefits: ఉల్లి, వెల్లుల్లి పొట్టు మనకు ఇంత మంచి చేస్తుందా..?

Published : Jul 12, 2022, 03:57 PM IST

Health Benefits:ఉల్లి, వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలుసు. అయితే వీటితో పాటుగా వీటి పొట్టు కూడా మన ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

PREV
18
 Health Benefits: ఉల్లి, వెల్లుల్లి పొట్టు మనకు ఇంత మంచి చేస్తుందా..?

కూరగాయల ద్వారా మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అందుకే రెగ్యులర్ గా పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే సాధారణంగా కూరగాయలను కట్ చేసి వాటి పొట్టును మాత్రం చెత్తబుట్టలో వేస్తుంటాం. ఎందుకంటే ఇవి దేనికీ పనికి రావనే ఉద్దేశంతో. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కూరగాయలు ఏ రకంగా మనకు మేలు చేస్తాయో.. వాటి పొట్టు కూడా మనకు మేలు చేస్తాయి. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి పొట్టు, తొక్కలను ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. 

28

కూరగాయల్లో ఏవిధమైన పోషకాలు ఉంటాయో.. అలాగే ఉల్లి, వెల్లుల్లి పొట్టుల్లో కూడా ఉంటాయట. వీటి పొట్టుల్లో విటమిన్ ఎ, విటమిన్  సి,  విటమిన్ ఇ, ఇతర ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఉల్లి పొట్టు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38

ఉల్లిపాయ పొట్టు ప్రయోజనాలు:

కండరాల నొప్పికి నివారణ : ఉల్లిపాయ పొట్టులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం ఉల్లిపాయ పొట్టును 10 నుంచి 20 నిమిషాల పాటు నీళ్లలో మరిగించాలి. ఆ తర్వాత దానిని ఫిల్టర్ చేసి పడుకునే ముందు టీ లాగా తాగితే కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. రెగ్యులర్ గా తాగితేనే మంచి ఫలితాలొస్తాయి.
 

48

దురదకు నివారణ:  ఉల్లిపాయ, వెల్లుల్లి పొట్టులో యాంటీ ఫంగల్ గుణాలుంటాయి.  ఇవి చర్మంపై అయ్యే దురద సమస్యను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం వీటి తొక్కలను నీటిలో కాసేపు మరిగించి.. చల్లారిన తర్వాత ఆ నీటిని దురద పెట్టే ప్లేస్ లో అప్లై చేయాలి. 
 

58

నిద్రలేమి సమస్యను పోగొడుతుంది : ఉల్లి, వెల్లుల్లి తొక్కలు నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అర్థరాత్రులు మేల్కొనే వారు.. కంటి నిండా నిద్రపట్టని వారు ఈ  తొక్కలతో చేసిన టీని తాగాలి. ఈ టీ మంచి నిద్రకు సహాయపడుతుంది. 

68

కంటి చూపుకు మంచిది: ఉల్లి తొక్కల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాగా ఈ రెండు విటమిన్లు కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు దీనిపొట్టుతో తయారుచేసిన టీని తాగాలి. 

78

ఉల్లిపాయ తొక్కతో టీ ని ఎలా తయారు చేయాలి :

టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
3 నుంచి 4 మీడియం సైజు ఉల్లిపాయ పొట్టు: 2 కప్పుల

నీళ్లు

1 టీ స్పూన్ తేనె
 

88

టీ ని తయారుచేసే పద్దతి: టీ ని తయారు చేయడానికి తీసిపెట్టుకున్న ఉల్లిపాయ తొక్కను నీటిలో బాగా కడిగి 2 కప్పుల నీటిలో వేసి బాగా మరిగించండి. వాటర్ రంగు మారేంత వరకు అలాగే మరిగించండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి.. ఆ నీళ్లన ఫిల్టర్ చేసి తేనెను మిక్స్ చేసి తాగండి. 

Read more Photos on
click me!

Recommended Stories