గుమ్మడికాయ, దాల్చిన చెక్క పొడి కలిపి పట్టిస్తే కొన్ని రోజుల్లోనే మెరిసే చర్మ!

Published : Jul 12, 2022, 04:18 PM IST

నలుగురిలో అందంగా ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని చర్మ సౌందర్యం (Skin beauty) కోసం అమ్మాయిలు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఇందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడం చేస్తుంటారు.   

PREV
16
గుమ్మడికాయ, దాల్చిన చెక్క పొడి కలిపి పట్టిస్తే కొన్ని రోజుల్లోనే మెరిసే చర్మ!

ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడానికి తాత్కాలిక ప్రయోజనాలను (Temporary benefits) మాత్రమే అందిస్తాయి. అదే ఇంటిలోనే తయారు చేసుకునే సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందగలరు. కనుక వేటిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

26

ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty products) చర్మ సహజ సిద్ధమైన సౌందర్యాన్ని లోపలి నుంచి దెబ్బతిస్తాయి. దీంతో చర్మ సమస్యలు ఏర్పడతాయి. కనుక ఇంట్లోనే అందుబాటులో ఉండే వాటితో సహజ సిద్ధమైన పద్ధతులలో చేసుకునే కొన్ని బ్యూటీ టిప్స్ ను అనుసరిస్తే చర్మ ఆరోగ్యం (Skin health) లోపలి నుంచి మెరుగుపడి చర్మం కాంతివంతంగా, కోమలంగా మారుతుంది. దీంతో మీ అందమైన, కోమలమైన చర్మ సౌందర్యం నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది.
 

36

బియ్యప్పిండి, అరటిపండు గుజ్జు: ఒక కప్పులో కొద్దిగా బియ్యప్పిండి (Rice flour), బాగా పండిన అరటిపండు గుజ్జును (Banana pulp) తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు ప్రయత్నిస్తే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, నల్లటి మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
 

46

గుమ్మడికాయ, దాల్చిన చెక్క పొడి, రోజ్ వాటర్: ఒక కప్పులో ఒక స్పూన్ గుమ్మడికాయ గుజ్జు (Pumpkin pulp), చిటికెడు దాల్చిన చెక్క పొడి (Cinnamon powder), కొద్దిగా రోజ్ వాటర్ (Rose water) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసుకుని అరగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
 

56

నిమ్మరసం, గ్లిజరిన్: ఒక కప్పులో రెండు స్పూన్ ల నిమ్మరసం (Lemon juice), రెండు స్పూన్ ల గ్లిజరిన్ (Glycerin) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చర్మ కణాలలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. దీంతో కాంతివంతమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
 

66

కాఫీ పొడి, తేనె: ఒక కప్పులో కొంచెం కాఫీ పొడి (Coffee powder), ఒక స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అరగంట నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం ముఖానికి మంచి స్క్రబ్ గా సహాయపడి మృత కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.

click me!

Recommended Stories