చలికాలంలో బెల్లం టీ ని తాగితే ఫాస్ట్ గా బరువు తగ్గడమే కాదు.. ఈ సమస్యలు కూడా నయమవుతాయి తెలుసా..?

First Published Jan 24, 2023, 9:48 AM IST

బెల్లాన్ని వింటర్ సూపర్ ఫుడ్ అంటారు. ఇది ప్రాసెస్డ్ షుగర్ కు గొప్ప ప్రత్యమ్నాయం. బెల్లం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీకు తెలుసా..? ఈ సీజన్ లో బెల్లం టీని పరిగడుపున తాగితే సులువుగా బరువు తగ్గడమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
 

చలికాలంతో పాటుగా ఎన్నో రోగాలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలను తగ్గించడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇవి చల్లని వాతావరణంలో కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నేచురల్ స్వీటెనర్ అయిన బెల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నోఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బెల్లంలో విటమిన్లు, జింక్, రాగి, కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు.

నిజానికి ప్రాసెస్ చేసిన చక్కెర ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తాయి. అందుకే దీనికి బదులుగా బెల్లాన్ని తీసుకోవడం మంచిది. చక్కెరతో పోలిస్తే బెల్లమే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎలాంటి హాని చేయదు. అందుకే మీరు తాగే టీ లేదా మరే ఇతర ఆహారాల్లోనైనా దీన్ని వేయండి. మీకు తెలుసా.. బెల్లంతో చేసిన టీని ఉదయం పరిగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అవేంటంటే.. 

గొప్ప డిటాక్స్ డ్రింక్

టాక్సిన్స్ మన శరీరానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా ఇవి దీర్ఘకాలం పాటు శరీరంలో ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే వీటిని శరీరంలోంచి బయటకు పంపాలి. పరగడుపున ఒక కప్పు బెల్లం టీ తాగడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. అంతేకాదు ఇది కాలేయానికి గొప్ప క్లెన్సర్ కూడా. ఎందుకంటే ఇది శరీరంలోని హానికరమైన విషాన్ని సమర్థవంతంగా బయటకు పంపుతుంది. అంతేకాదు ఇది మన శరీరాన్ని అవాంఛిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఈ బెల్లం టీని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ఆరోగ్యం, కాంతివంతంగా తయారవుతుంది. ఎసిడిటీ, జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లం టీ మన గట్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

అదనపు కిలోలను తగ్గించడానికి కఠినమైన ఆహారాన్నితీసుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు బెల్లం టీని తమ డైట్ లో చేర్చుకుంటే మంచిది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే శరీరంలో పేరుకుపోయిన కేలరీలు కరుగుతాయి. ఈ బెల్లం టీలో విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, జింక్, పొటాషియం వంటి మరెన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది మన జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. ఇది ఫైబర్ కు మంచి మూలం కూడా. ఇది మన కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఆకలి కోరికలను తగ్గిస్తుంది. ఇది మన శరీరంలో జీవక్రియను పెంచడానికి, మన శక్తి స్థాయిలను రెట్టింపు చేయడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఒక కప్పు బెల్లం టీ తాగి, ఆ తర్వాత వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 

ఫ్లూ నుంచి సురక్షితంగా ఉంచుతుంది

చలికాలంలో మనలో చాలా మందికి దగ్గు, జలుబు త్వరగా వస్తుంటాయి. అయితే బెల్లం టీ మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కాలాలతో పాటుగా వచ్చే ఫ్లూ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాదు దీనిలో విటమిన్లు, ఖనిజాలు ఉండటం వల్ల ఇది శరీరం ఎటువంటి ఇన్ఫెక్షన్ తోనైనా పోరాడటానికి, నిరోధకతను నిర్మించడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని బలంగా , ఆరోగ్యంగా చేస్తుంది.

click me!