ఒబెసిటీ : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి..

First Published Sep 25, 2021, 1:49 PM IST

 శరీర బరువును ముందునుంచే చూసుకుంటూ ఉండాలి. అప్పుడే రోజులు గడుస్తున్న కోద్దీ మీరు బరువు పెరుగుతున్న సంగతి గుర్తించగలుగుతారు. అది కనక మరీ ఎక్కువవుతుంటే.. జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు ఉన్నాయి. అలాంటివి తెలిస్తే ముందే జాగ్రత్తపడొచ్చు.  

స్థూలకాయం, ఒబెసిటీ.. గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రంగా వేధిస్తున్న సమస్య. ఇది అంటువ్యాధి రూపానికి మారి, క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితిలోకి నెట్టేసింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, రెండు జీవనశైలి అలవాట్లు సరిగా లేకపోవడం. ఫిట్‌గా మారడం అంటే ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా కీలకమే. 

weight loss

దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే.. మీ శరీర బరువును ముందునుంచే చూసుకుంటూ ఉండాలి. అప్పుడే రోజులు గడుస్తున్న కోద్దీ మీరు బరువు పెరుగుతున్న సంగతి గుర్తించగలుగుతారు. అది కనక మరీ ఎక్కువవుతుంటే.. జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు ఉన్నాయి. అలాంటివి తెలిస్తే ముందే జాగ్రత్తపడొచ్చు.  

బట్టలు టైట్ అవ్వడం... : ఒకటి, రెండు నెలల్లో బరువులో స్వల్ప హెచ్చుతగ్గులు జరగడం సహజం. మహిళల్లో, ఇది వారి నెలవారీ రుతు చక్రానికి దగ్గరగా ఉంటుంది, ఇది ప్రధానంగా హార్మోన్ల మార్పుల వల్ల, నీరు నిలిచపోవడం వల్ల జరుగుతుంది. దీనివల్ల బట్టలు కొన్న కొద్ది రోజుల్లోనే కొనుకున్న కొత్త బట్టలు టైట్ అవుతుంటాయి. ఇది మీరు నెమ్మదిగా బరువు పెరుగుతున్నారనడానికి హెచ్చరిక. షర్ట్ గుండీలు పెట్టుకోలేదు.. బ్లౌజ్ లు టైట్ అవుతాయి. ముఖ్యంగా నడుం భాగంలో, చేతుల ప్రాంతంలో లావు తెలిసిపోతుంది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు. 

కాళ్లు, పాదాల్లో వాపులు..  అధిక బరువు మీ కాళ్లు, పాదాలలో నాడీ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే నాడులు ప్రభావితం అవుతాయి. కాబట్టి, అధిక బరువు ఉన్నప్పుడు, నరాములు రక్తాన్ని సరిగా తీసుకెళ్లలేవు. దీనివల్ల కాళ్లు, పాదాలలో వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితి తీవ్రమైతే, ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల్లో వెరికోస్ వీన్స్, క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, బరువు పెరగడం కూడా ఊబకాయానికి దారి తీయవచ్చు, ఇది వీరిలో గుండెపోటు వచ్చే ప్రమాదానికి కారణమవుతుంది.  

శ్వాస ఆడకపోవడం : శ్వాస ఆడకపోవడం అనేక ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. వాటిలో ఒకటి బరువు పెరగడం. అధిక బరువు ఉన్న వ్యక్తులు తరచుగా వారి ఛాతీ చుట్టూ చాలా కొవ్వు పేరుకుపోతుంది. ఇది సాధారణ శ్వాసకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల ఇంటి పనులు చేసిన తర్వాత  ఊపిరి సరిగా ఆడకపోవడం జరుగుతుంది. వాకింగ్ చేయడం, భారీ బరువులు ఎత్తడం వీరికి చాలా కష్టమైన పని.  ఈ పరిస్థితి తీవ్రమైతే, వారు పడుకున్నప్పుడు కూడా సరిగా శ్వాస తీసుకోవడం  కష్టమవుతుంది.

అలసట : మీకు అన్ని సమయాలలో అలసిపోయినట్లుగా అనిపిస్తే, కొద్ది రోజులుగా మీరు బరువు పెరిగారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. బరువు పెరిగిన వ్యక్తులు తరచుగా రాత్రి పూట మంచి నిద్ర పోయిన తరువాత కూడా ఉదయం లేవగానే అలసిపోతారు. ఎందుకంటే ఊబకాయం వల్ల రాత్రి వేళ శ్వాస ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. ఇది స్లీప్ అప్నియాకు కారణమవుతుంది. దీనివల్ల ఈ వ్యక్తులు రాత్రి సమయంలో గురకపెడతారు. తరచుగా మేల్కొంటారు, ఇది వారి నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పగటిపూట అలసిపోయేలా చేస్తుంది.

పిరియడ్స్ సరిగా రాకపోవడం, మలబద్ధకం : మహిళల్లో, బరువు పెరగడం వలన వారి నెలవారీ రుతు చక్రం అంతరాయం కలిగించే హార్మోన్ల సమస్యలకు దారితీస్తుంది. పీరియడ్ నొప్పి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా, బరువు పెరగడం కూడా పురుషులు, మహిళలు ఇద్దరిలో మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం అవదు. ఫలితంగా,  ఉదయం మలబద్ధకానికి దారితీస్తుంది. 

constipation

పిరియడ్స్ సరిగా రాకపోవడం, మలబద్ధకం : మహిళల్లో, బరువు పెరగడం వలన వారి నెలవారీ రుతు చక్రం అంతరాయం కలిగించే హార్మోన్ల సమస్యలకు దారితీస్తుంది. పీరియడ్ నొప్పి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా, బరువు పెరగడం కూడా పురుషులు, మహిళలు ఇద్దరిలో మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం అవదు. ఫలితంగా,  ఉదయం మలబద్ధకానికి దారితీస్తుంది. 

click me!