కోసిన పండ్ల ముక్కలు.. నల్లగా మారకుండా.. తాజాగా ఉండాలంటే...

First Published | Sep 24, 2021, 3:53 PM IST

మరి దీనికి పరిష్కారం లేదా? కోసిన పండ్లను తాజాగా ఉంచే మార్గాలు, ఉపాయాలు లేవా? అంటే ఉన్నాయి. కొన్ని రకాల చిట్కాలు ఉపయోగించడం వల్ల మీ పండ్లు కోసినా తర్వాత కూడా చాలా సేపు తాజాగా ఉండేలా చూసుకోవచ్చు.

కొన్ని పండ్లు కోసి పెడితే బ్రౌన్ రంగులోకి మారిపోతాయి. తిందామని కోసి, మరిచిపోయినప్పుడు.. లేదా ఎక్కువ మొత్తంలో కోసినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా బాధిస్తుంది. అంతంత డబ్బులు పోసి కొన్న పండ్లను పడేయలేక.. అలా  గోధుమరంగులోకి మారిన వాటిని తినాలంటే మనసొప్పక సతమతమవుతుంటారు. 

మరి దీనికి పరిష్కారం లేదా? కోసిన పండ్లను తాజాగా ఉంచే మార్గాలు, ఉపాయాలు లేవా? అంటే ఉన్నాయి. కొన్ని రకాల చిట్కాలు ఉపయోగించడం వల్ల మీ పండ్లు కోసినా తర్వాత కూడా చాలా సేపు తాజాగా ఉండేలా చూసుకోవచ్చు.

fruits

నిజానికి పండ్లు కోసినప్పుడు గోధుమ రంగులోకి మారడానికి కారణం ఆక్సీకరణ చెందడమే. ఆపిల్, పియర్, జామ వంటి పండ్లు కోసిన తరువాత కొన్ని గంటల్లో గోధుమ రంగులోకి మారుతాయి. దీనికి కారణం ముందు చెప్పుకున్నట్టుగా ఆక్సీకరణ చెందడమే. పండ్ల ఆక్సీకరణ రెండు ప్రధాన కారణాల వల్ల జరుగుతుంది. ముందుగా, పండ్లు గాలికి ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల... గాలిలోని తేమ రుచి, ఆకృతిలో మార్పును కలిగిస్తుంది. రెండవది, యాపిల్స్ వంటి పండ్లను కోసినప్పుడు తక్షణమే ఎంజైమ్‌లు విడుదల అవుతాయి. దీనివల్ల వాటిని గాలికి పెట్టినప్పుడు లేదా ముక్కలుగా కోసి ఎక్కువ గంటలు ప్యాక్ చేసినప్పుడు, ఎంజైమాటిక్ ప్రతిచర్యలు ఆపిల్స్ నల్లబడటానికి కారణమవుతాయి.


దీనికోసం పండ్లు కోసిన తరువాత వాటిని చల్లటి రన్నింగ్ వాటర్ తో కడగాలి. దీనివల్ల ఎంజైమాటిక్ ప్రతిచర్యలను తగ్గించడానికి, మందగించడానికి సహాయపడుతుంది. అందువల్ల, పండ్లు గోధుమ రంగులోకి మారకుండా కాపాడుతుంది.

ఇంకో బెస్ట్ ఉపాయం.. కోసిన పండ్లను ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి ఉప్పు కలిపిన నీరు కలపాలి. ఈ నీటిలో 2,3 నిమిషాలు పండ్లను ఉంచేసి.. తరువాత నీటిని పూర్తిగా వంపేయాలి. తరువాత పండ్లను నిల్వచేస్తే పండ్లు గోధుమ రంగులోకి మారకుండా ఉంటాయి. 

జింజర్ ఆలే :  పండ్లను చల్లటి నీటితో కడిగిన తర్వాత మీరు వాటిని జింజర్ ఆలేలో ముంచవచ్చు. ఈ పానీయంలో తినదగిన సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన పండ్లు ఆక్సీకరణం చెందకుండా నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తాయి, వాటి క్రిస్పీనెస్ పోకుండా ఉంచుతాయి. 

తేనె : పండ్లను మధ్యాహ్న భోజనం లేదా రోడ్డు ప్రయాణం కోసం ప్యాక్ చేయాలనుకుంటే, తేనె, గోరువెచ్చని నీటి మిశ్రమంతో డ్రెస్సింగ్ చేయండి. ఈ ద్రావణంలో పండ్లను కలపండి. తేనెలోని సుగుణాలు తాజా పండ్లను ప్రకాశవంతంగా, స్ఫుటంగా ఉంచుతుంది. వాతావరణ పరిస్థితులను బట్టి ఆక్సిడేషన్ నుండి కనీసం 8-9 గంటల వరకు కాపాడుతుంది. 

ముక్కలు చేసిన పండ్ల తాజాదనం పోకుండా ఉండాలంటే, నిమ్మ, పైనాపిల్ లేదా ఆరెంజ్ వంటి ఏదైనా సిట్రస్ రసం సాధారణ మిశ్రమాన్ని తయారు చేయండి, దానిని కొద్దిగా నీరు లేదా తేనెతో కలపండి. ద్రావణాన్నిబాగా కలపండి.  దీంట్లో ముక్కలు వేసి నానబెట్టాలి. దీనివల్ల సిట్రస్ లక్షణాలు పండ్లను బాగా పట్టుకుంటాయి. ఇది ఎంజైమాటిక్ ప్రతిచర్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పండ్లు నల్లగా, తడిగా మారకుండా కాపాడుతుంది.

Latest Videos

click me!