సన్నగా ఉన్నానే అని ఫీలవుతున్నారా.. అరటి పండును ఇలా తినండి.. కొద్దిరోజుల్లోనే బరువు పెరుగుతారు..

First Published Sep 22, 2022, 3:42 PM IST

కొంతమంది మరీ బక్కపల్చగా ఉంటారు. ఎంత లావు కావాలని ప్రయత్నించినా.. బరువు ఇంచు కూడా పెరగరు. ఇలాంటి వారికి అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. 
 

కొంతమంది లావుగా ఉన్నామే.. అని బాధపడితే.. ఇంకొంతమంది మాత్రం నేను ఇంత బక్కగా ఉన్నానే అని తెగ ఇదైపోతుంటారు. నిజానికి వయసు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక బరువు పెరిగేందుకని ఏవేవో తినే వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ బరువు పెరగరు. దీనికి కారణం బరువు పెరిగేందుకు ఏ ఆహారాలను తినాలో తెలియకపోవడం. అయితే ఇలాంటి వారికి అరటి పండు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పండు శరీర శక్తి స్థాయిలను పెంచడమే కాదు.. బరువును కూడా పెంచుతుంది. రోజూ ఒక అరటిపండును తినడం వల్ల శరీరానికి కండ పట్టడమే కాదు.. మంచి ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మరి బరువు పెరిగేందుకు అరటిపండును ఎలా తినాలో తెలుసుకుందాం పందండి. 
 

banana

హెల్తీగా ఉంటూ.. బరువు పెరగాలంటే ప్రతిరోజూ మీడియం సైజులో ఉండే రెండు అరటిపండ్లను తినండి. అది కూడా ఎక్సర్ సైజెస్ చేసిన తర్వాతే. ఇలా తింటేనే మీ ఒంటికి కండ పడుతుంది. అలాగే కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది. ఈ పండ్లు మీకు తక్షణ శక్తికి అందిస్తాయి. 

మరీ సన్నగా ఉండేవారు బ్రేక్ ఫాస్ట్ లో అరటిని తినడం మంచిది. బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండును తినడం వల్ల బరువు పెరగడమే కాదు.. రోజంతా ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు. అరటిని అలాగే తినాలనిపించకపోతే..  షేక్ చేసుకుని లేదా పాలలో వేసుకుని తీసుకోండి. కానీ రాత్రిళ్లు మాత్రం అరటిని తినకూడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

బరువు పెరిగేందుకు అరటిపండును మధ్యాహ్నం పూట కూడా తినొచ్చు. ఇందుకోసం పెరుగు, అరటిని కలిపి తినండి. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ కాంబినేషనల్ అరటిని తీసుకుంటే.. ఫుడ్ తొందరగా అరుగుతుంది. జీవక్రియ రేటుకు కూడా పెరుగుతుంది. అయితే అరటిలో కొద్దిగా పెరుగును వేసి జ్యూస్ గా తయారుచేయాలి. దీనిలో యాలకుల పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ ను మిక్స్ చేసి తాగితే.. మీ ఆరోగ్యం బాగుంటుంది. బలం కూడా పెరుగుతుంది. 
 

అరటిని స్నాక్స్ గా తింటే కూడా మీరు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అరటి, తేనె, బాదం పప్పులను కలిపి తింటే మీ శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే కండరాలు బలంగా మారుతాయి. బరువు కూడా ఫాస్ట్ గా పెరుగుతారు. 

click me!