ఈ గింజలు గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. రోజూ తినండి..

First Published Sep 22, 2022, 2:00 PM IST

నట్స్ లో విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగ్గా చేయడమే కాదు.. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

వాల్ నట్స్  మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మిన్నె సోటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వాల్ నట్స్  తినే వారికి గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని న్యూయార్క్ లోని కెల్మాన్ వెల్నెస్ సెంటర్ లో క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లారెన్ పెల్లెహాచ్ చెప్పారు.
 

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంతో పాటుగా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గట్ మైక్రోబయోటాపై  ప్రభావం కారణంగా వాల్  నట్స్ హృదయనాళ ప్రయోజనాలను కలిగించడానికి సహాయపడతాయని 2019 అధ్యయనం సూచిస్తోంది.
 

పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే వాల్ నట్స్ తినడం వల్ల మెదడు పనితీరుకు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, మెదడు నష్టాన్ని తగ్గించడమే కాకుండా, అభిజ్ఞా విధులను కూడా మెరుగుపరుస్తాయి. వాల్ నట్స్ కూడా బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిని కొన్ని తిన్నా.. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. 
 

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే వాల్ నట్స్ ను తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే ఈ వాల్ నట్స్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే టైప్ 2 డయాబెటీస్ తో సంబంధం ఉన్న ఇతర అనారోగ్య సమస్యల రిస్క్ కూడా తగ్గుతుంది. వాల్ నట్స్ బరువును తగ్గించడానికి సహాయపడతాయి కాబట్టి.. మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. 
 

100 గ్రాముల వాల్ నట్స్ లో 15.23 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. వాల్ నట్స్ లో కూడా ఫ్లేవనాయిడ్లు,  ఫినోలిక్ ఆమ్లం ఉంటుంది. వాల్ నట్స్ లో ఉండే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ గుప్పెడు వాల్ నట్స్ తినాలి. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

click me!