రాత్రిపూట ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా పడుకోవాలంటే ఇలా చేయండి..

Published : Oct 22, 2022, 05:00 PM IST

మెలటోనిన్ అనే హార్మోన్ వల్లే రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. ఇది లేకపోవడం వల్ల నిద్ర పట్టదు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఈ మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది.   

PREV
16
 రాత్రిపూట ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా పడుకోవాలంటే ఇలా చేయండి..
sleeping

మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. దీనివల్లే.. ప్రశాంతంగా నిద్రపడుతుంది. అయితే మన శరీరం ఈ హార్మోన్ ను సహజంగానే  ఉత్పత్తి చేస్తుంది. మన శరీరంలో మెలటోనిన్ స్థాయిలు చీకటి పడుతున్న కొద్దీ పెరుగుతాయి. దీనర్థం.. ఇది నిద్రపోయే సమయం అని. ఈ హార్మోన్ మన రక్త ప్రవాహంలో వ్యాప్తి చెందుతుంది. నరాల కార్యకలాపాలను తగ్గిస్తుంది. మెలటోనిన్ రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరి ఈ హార్మోన్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.

26

సూర్య రశ్మి లో ఉండాలి

ప్రతిరోజూ ఉదయం కనీసం 15 నిమిషాలైనా.. సూర్య రశ్మిలో ఉండాలి.  దీనివల్ల మెలటోనిన్ హార్మోన్ స్థాయిలు పగటి పూట బాగా తగ్గుతాయి. అలాగే రాత్రిపూట మీరు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది. సూర్య రశ్మి ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చీకటి కూడా నిద్రను ప్రేరేపిస్తుంది. అందుకే మీరు పడుకునే గదిలో వెలుతురు ఉండకుండా చూసుకోండి. 

36
sleeping

కెఫిన్ తీసుకోకూడదు

కెఫిన్ ను ఎప్పుడో ఒకసారి తాగితే పెద్దగా నష్టమేమీ జరగదు. కానీ రాత్రిపూట కెఫిన్ ను అస్సలే తాగకూడదు. ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత దీని జోలికే వెళ్లకూడదు. ఒకవేళ తాగితే బాడీ యాక్టీవ్  అవుతుంది. అందుకే భోజనం తర్వాత కెఫిన్ ఉన్న పానీయాలను, ఆహారాలను అసలే తీసుకోకూడదు. 

46
sleeping

స్క్రీన్ లను చూడకూడదు

పడుకునే రెండు లేదా గంట ముందు నుంచే టీవీ, కంప్యూటర్, ఫోన్ వంటి డిజిటల్ పరికరాలను పక్కన పెట్టండి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను దూరం చేస్తుంది. వీటి నుంచి వచ్చే నీలం, తెలుపు తరంగదైర్ఘ్యాలు మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. 

56
day time sleep

ఒత్తిడి

ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది. ఇది మెలటోనిన్ హార్మోన్ విడుదలను కూడా అడ్డుకుంటుంది. మెలటోనిన్, కార్టిసాల్ విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటిలో ఏది తగ్గినా రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 
 

66
sleep

మెగ్నీషియం

మెగ్నీషియం మన శరీరానికి చాలా అవసరం. ఇవి ఉండే ఆహారాలను రాత్రిపూట తినడం వల్ల రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. మెగ్నీషియం మెదడు పనితీరును మందగించేలా చేస్తుంది. అవకాడో, బాదం, గుమ్మడి గింజలు, ఆకుకూరల్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు రాత్రిపూట ప్రశాంతంగా, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పడుకోవడానికి సహాయపడతాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories