తీపి పానీయాలను తీసుకోకూడదు
షుగర్ పేషెంట్లు తీపి పానీయాలను తాగకపోవడమే మంచిది. అయితే చాలా మంది పండుగల సమయంలో ఉపవాసం ఉండి.. తీపి పానీయాలనే ముందు తాగుతుంటారు. కానీ ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. పండుగ రోజైనా సరే.. తప్పని సరిగా రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలి. ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మెడిసిన్స్ ను యూజ్ చేయాలి. ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషకాహారం తప్పని సరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండే వాటినే తినాలి.