Motivation story
ఒక నది ఒడ్డున పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. బలమైన దానిని అని దానికి చాలా పొగరు ఉండేది. 'నేను చాలా మందికి నీడను ఇస్తాను. ఎంతటి విపత్తు అయినా నన్ను ఏం చేయలేదు. ఎవరైనా నా మీదే ఆధారపడతారు' అంటూ గర్వంగా మాట్లాడేది. తన చుట్టూ ఉన్న గడ్డి పరకలను చూస్తు ఎప్పుడూ హేలన చేస్తుండేది. ఉఫ్పుమని ఊదితే పోతారు మీది ఓ బతుకేనా అంటుండేది.
Moral Story
అయితే ఓ రోజు పెద్ద తుపాను వస్తుంది. బలమైన ఈదురు గాలులు వీస్తుంటాయి. దీంతో ఆ పెద్ద మర్రి చెట్టు గాలికి కూలి పోతుంది. గాలిని తట్టుకోవడానికి తన బలమంతా ఉపయోగించి అడ్డుకుంటుంది. దీంతో వేళ్లతో సహా చెట్టు కింద పడిపోతుంది. అయితే అక్కడ ఉన్న గడ్డి పరకలు మాత్రం గాలికి ఊగి, గాలి తగ్గగానే మళ్లీ ఎప్పటిలాగా నిలబడతాయి.
Moral Story
దీంతో అక్కడే ఉన్న కొన్ని తేనేటీగలు ఇలా చర్చించుకున్నాయి. 'మర్రి చెట్టు ఎప్పుడూ తాను బలమైన దానిని అంటూ విర్రవిగేది. కానీ ఎంత పెద్దదైనా, ఎంత బలమైందైనా ఏదీ శాశ్వతం కాదు అనే విషయాన్ని మర్రి చెట్టు గుర్తించలేదు' అంటూ మాట్లాడుకుంటాయి.
నీతి: మనలో కూడా చాలా మంది ఇలాగే తమ బలాన్ని, అధికారాన్ని, డబ్బును చూసుకొని మురిసిపోతుంటారు. అక్కడితో ఆగకుండా పక్కవారిని చులకనగా చేసి మాట్లాడుతుంటారు. నిజానికి మన పేరు, డబ్బు, కీర్తి ఇలా ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్న రోజు మనిషి సంతోషంగా ఉంటాడు అనే గొప్ప సందేశం ఈ చిన్న కథలో ఉంది.