చలికి బుగ్గలు ఎందుకు ఎర్రగా మారుతాయి..? వీటిని తగ్గించే చిట్కాలు మీకోసం

Published : Oct 29, 2023, 02:02 PM IST

చలికాలంలో వింటర్ రోసేసియా రావడం చాలా సహజం. అయితే మన శరీరం తేలికపాటి చలికి తట్టుకుంటుంది. కానీ డిసెంబర్, జనవరిలో చలి విపరీతంగా పెడుతుంది. దీనికి మన శరీరం తట్టుకోలేదు. దీనివల్ల బుగ్గలు పొడిబారడం, ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని చిట్కలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.   

PREV
16
 చలికి బుగ్గలు ఎందుకు ఎర్రగా మారుతాయి..? వీటిని తగ్గించే చిట్కాలు మీకోసం

మారుతున్న వాతావరణం మన ఆరోగ్యాన్నే కాదు మన చర్మాన్ని కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. దీని ప్రభావం చేతులు, పెదవులు, పాదాలు, బుగ్గలపై కూడా కనిపిస్తుంది. అందుకే చలికాలంలో చర్మ సంరక్షణ చాలా చాలా అవసరం. వీటితో పాటుగా చలికాలంలో వచ్చే మరో చర్మ సమస్య బుగ్గలు ఎర్రగా మారడం. అసలు ఈ సీజన్ లో బుగ్గలు ఎందుకు ఎర్రగా మారుతాయి? వీటిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26

For Acne: Mango pulp with curd and honey can be a great aid for people with oily skin. It will help you to fight pigmentation and acne by shedding off the excessive oil from your face. Extract pulp from a ripe mango; add 2 tablespoon of curd and 2 teaspoons of honey. Apply this face pack on your face and wash it off after 15 minutes.

చలిలో బుగ్గలు ఎందుకు ఎర్రబడతాయి?

చలికాలంలో మన శరీరంలో రక్త ప్రసరణ కాస్త నెమ్మదిస్తుంది. దీంతో మన చర్మం లోపల రక్త నాళాలు రక్త సరఫరా కోసం వెడల్పుగా అవుతాయి. దీంతో మన ముఖానికి కావాల్సిన రక్తం సరఫరా అవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం చర్మాన్ని వెచ్చగా చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో బుగ్గలను ఎర్రగా అవుతాయి.  దీనికి తోడు చల్ల గాలులు, మాయిశ్చరైజేషన్, పోషకాహార లోపం వల్ల కూడా చర్మం ఇలా ఎర్రగా మారుతుంది. మరి చర్మం ఎర్రగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

36
acne

శరీరాన్ని హైడ్రేట్ గా.. 

ఎండాకాలంలో ఉక్కపోతల వల్ల నీటిని పుష్కలంగా తాగుతారు. కానీ చలికాలంలో అస్సలు దాహంగా అనిపించదు. అందుకే చాలా మంది ఈ సీజన్ లో నీటిని అస్సలు తాగరు. కానీ దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఈ ప్రభావం మన చర్మంపై కనిపిస్తుంది. అంటే దీనివల్ల మీ చర్మం హైడ్రేటెడ్ గా ఉండదు. దీంతో చర్మం పగిలిపోవడం మొదలవుతుంది. అందుకే ఈ సీజన్ లో కూడా నీటిని పుష్కలంగా తాగాలి. 
 

46

కొల్లాజెన్ ఉత్పత్తులు

మన వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ తగ్గుతుంది.ఈ  కొల్లాజెన్ చర్మానికి బిల్డింగ్ బ్లాక్ గా పనిచేస్తుంది.  దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొల్లాజెన్ చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో మీ బుగ్గలు ఎర్రగా మారితే.. చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా కొల్లాజెన్ సప్లిమెంట్లను లేదా కొల్లాజెన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. 
 

56

హైడ్రేటింగ్ సీరం 

హైలురోనిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే సీరమ్ ను కూడా ఎర్రని బుగ్గలను మళ్లీ నార్మల్ గా చేస్తుంది. ఎర్రని, పొడి చర్మానికి హైడ్రేటింగ్ సీరం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే సీరాన్ని ఉపయోగించే ముందు మీ చర్మ రకాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

66

హైడ్రేటింగ్ మాస్క్..

పొడిచర్మం, ఎర్రగా మారిన బుగ్గలు వంటి సమస్యలను తగ్గించుకోవాలనుకుంటే హైడ్రేటింగ్ మాస్క్ లను ఖచ్చితంగా ఉపయోగించండి. మన చర్మం లోపలి నుంచి హైడ్రేట్ గా ఉండాలంటే నీటిని పుష్కలంగా తాగాలి. అలాగే బయటి నుంచి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి హైడ్రేటింగ్ మాస్క్ లను ఉపయోగించండి. వారానికి ఒకసారి ఈ మాస్క్ లను వాడండి. తేడాను మీరే గమనిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories