షుగర్ పేషెంట్లకు గుడ్లు మంచివేనా?

First Published | Oct 29, 2023, 11:44 AM IST

గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. దీంతో ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. అయితే వీటిని మధుమేహులు తినొచ్చా? లేదా? అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

eggs

గుడ్లు మంచి పోషకాహారం. వీటిలో లుటిన్, కోలిన్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.  గుడ్డులోని పచ్చసొన బయోటిన్ ను మంచి వనరు. ఇది మన చర్మాన్ని, గోర్లను, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి చాలా చాలా అవసరం. గుడ్లలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఈ ఆమ్లాలు మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. 

Image: Freepik

అయితే కొంతమంది గుండె జబ్బులు, షుగర్ పేషెంట్లకు గుడ్లు మంచివి కావని చెబుతుంటారు. ఎందుకంటే గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచదు. కానీ హార్ట్ పేషెంట్లు ముందు జాగ్రత్తగా.. గుడ్లను డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే తినాలి. 
 

Latest Videos


డయాబెటిక్ పేషెంట్లకు గుడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు

షుగర్ పేషెంట్లు కూడా గుడ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. అలాగని వీటిని ఎక్కువ మొత్తంలో తినకూడదు. పలు పరిశోధనల ప్రకారం.. గుడ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెరుగుతాయనే భయం ఉండదు. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు గుడ్లతో  బ్లడ్ షుగర్ లెవల్స్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే డయాబెటీస్ పెషెంట్లు బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. డయాబెటీస్ పేషెంట్లకు గుడ్లు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయంటే.. 


1. గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 6, విటమిన్ బి 12, కాల్షియం, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
2. గుడ్లు కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. గుడ్లలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే పోషకాలు మన కంటిని సంరక్షిస్తాయి. కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. 
 

3. నిజానికి డయాబెటీస్ పేషెంట్లు చాలా తొందరగా అలసిపోతుంటారు. అయతే గుడ్లను తింటే ఈ సమస్య పోతుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్లు , విటమిన్ బి6, విటమిన్ బి12, థయామిన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్ లు మీకు శక్తిని అందిస్తాయి. 

డయాబెటిస్ పేషెంట్లు రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు వారానికి మూడు సార్లు గుడ్లను తినాలి. అయితే గుడుల్లోని తెల్లసొన వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే గుడ్లను ఎలా తింటున్నారు అనేది కూడా ముఖ్యమే. గుడ్లను వంట నూనె లేదా వెన్నలో ఉడికించి తినడం మంచిది కాదు. ఇది మీకు ప్రయోజనాలను ఏ మాత్రం ఇయ్యదు. కాగా ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తుంది. అందుకే గుడ్లను ఎప్పుడూ కూడా ఉడికించి తినండి. మీకు డయాబెటీస్ తో పాటుగా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రోజుకు ఒక గుడ్డును మాత్రమే తినాలి. పచ్చసొనను తినకపోవడమే మంచిది. 

click me!