Tips and Tricks: వీటితో ఉతికితే... మురికి పట్టిన సాక్స్... మళ్లీ తెల్లగా మారడం పక్కా..!

Published : Sep 30, 2025, 02:51 PM IST

Tips and Tricks: దాదాపు అందరూ సాక్సులను డిటర్జెంట్ లేదా.. సబ్బుతో ఉతుకుతూ ఉంటారు. కానీ.. వాటితో ఉతికినా ఆ నలుపు తొందరగా పోదు. కానీ.. మీరు బేకింగ్ సోడా జోడించి ఉతకడం వల్ల.. ఆ నలుపు చాలా తొందరగా వదులుతుంది.

PREV
14
Tips and tricks

తెలుపు రంగు సాక్సులు వేసుకోవడం పెద్దగా ఎవరికీ నచ్చదు. కానీ, పిల్లల యూనిఫాం కి మాత్రం ఈ తెల్లటి సాక్సులు వేయక తప్పదు. అయితే.. ఆ సాక్సులు ఒక్క రోజు వేసుకున్నా నల్లగా మారిపోతాయి. ఎన్ని సార్లు ఎంత ఉతికినా కూడా ఆ నలుపు పోదు. దీంతో... మళ్లీ కొత్త సాక్సులు కొనాల్సి వస్తుంది. కానీ... అలాంటి సమస్య లేకుండా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే... సాక్సులు మళ్లీ కొత్త వాటిలా మెరిసిపోతాయి. మరి, ఆ ట్రిక్స్ ఏంటో ఓసారి చూద్దామా....

24
తెల్లని సాక్సులు శుభ్రం చేయడానికి చిట్కాలు....

దాదాపు అందరూ సాక్సులను డిటర్జెంట్ లేదా.. సబ్బుతో ఉతుకుతూ ఉంటారు. కానీ.. వాటితో ఉతికినా ఆ నలుపు తొందరగా పోదు. కానీ.. మీరు బేకింగ్ సోడా జోడించి ఉతకడం వల్ల.. ఆ నలుపు చాలా తొందరగా వదులుతుంది. దీని కోసం... ఒక బకెట్ లో 500 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీరు పోయాలి. దానికి ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ వైట్ వెనిగర్, 1 టీ స్పూన్ డిటర్జెంట్, బేకింగ్ సోడా చేరిస్తే చాలు. వీటిని బాగా కలపాలి. ఇవి కలిపినప్పుడు నురగ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు... ఆ నీటిలో.. మురికిగా ఉన్న సాక్సులను చేరిస్తే సరిపోతుంది. ఆ తర్వాత నార్మల్ నీటితో వాటిని ఉతికితే సరిపోతుంది. వారానికి రెండుసార్లు.. ఇలా చేయడం వల్ల సాక్సులు కొత్తవాటిలా కనపడతాయి.

34
సింపుల్ ట్రిక్స్...

నిమ్మరసం, ఉప్పు

అర బకెట్ వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం , ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఈ నీటిలో మురికిగా మారిన సాక్సులను వేస్తే సరిపోతుంది. అరగంట పాటు అందులోనే ఉంచాలి. తర్వాత మరకలను మీ చేతులతో రుద్ది శుభ్రమైన నీటితో కడిగితే సరిపోతుంది. మీరు వారానికి రెండు సార్లు ఈ ట్రిక్స్ పాటిస్తే, మీ తెల్లని సాక్స్‌లు మునుపటిలాగే తెల్లగా కనిపిస్తాయి.

బ్లీచ్...

బ్లీచ్ వాడి కూడా తెల్ల సాక్సుల మురికిని తొలగించొచ్చు. ఒక బకెట్‌లో కొంచెం వెచ్చని నీరు పోయాలి. 2-3 టీస్పూన్ల బ్లీచ్ , ఒక టీస్పూన్ డిష్ సోప్ జోడించండి. మురికి సాక్స్‌లను నీటిలో కలిపి అరగంట నాననివ్వండి. వాటిని శుభ్రమైన నీటిలో శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడా , వెనిగర్

బేకింగ్ సోడా , వెనిగర్ రెండూ సహజ బ్లీచింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి, సాక్స్ నుండి మురికి , దుర్వాసనను తొలగిస్తాయి. దీని కోసం, 2-3 టీస్పూన్ల బేకింగ్ సోడా , 1 కప్పు వైట్ వెనిగర్‌ను ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కలిపి, సాక్స్‌లను ఈ ద్రావణంలో 1 గంట పాటు నానబెట్టండి. తర్వాత, శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి.

44
బెస్ట్ ట్రిక్స్...

నిమ్మకాయ , ఉప్పు ద్రావణం

నిమ్మకాయలో తెల్లటి దుస్తులను ప్రకాశవంతం చేసే బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఒక కుండలో నీటిని వేడి చేసి, దానికి ఒక నిమ్మకాయ రసం, రెండు టీస్పూన్ల ఉప్పు కలపండి. ఈ నీటిలో సాక్స్‌లను 30-40 నిమిషాలు నానబెట్టండి. తర్వాత సున్నితంగా స్క్రబ్ చేసి కడగాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది తెల్లటి సాక్స్ నుండి నల్లటి మరకలను తొలగించడంలో సహాయపడే సహజ బ్లీచింగ్ ఏజెంట్. మూడింట ఒక వంతు హైడ్రోజన్ పెరాక్సైడ్ , మూడింట రెండు వంతుల నీటిని కలిపి ద్రావణాన్ని తయారు చేయండి. సాక్స్‌లను ఒక గంట పాటు ద్రావణంలో నానబెట్టండి. తర్వాత, నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టండి.

Read more Photos on
click me!

Recommended Stories