కానీ మనలో చాలా మందికి ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటో తెలియదు. ఈ ప్రోటీన్ ఫుడ్ మనకు ఏవిధంగా మేలు చేస్తుందో కూడా తెలియదు. దీనివల్ల చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ఈ ప్రోటీన్ లోపం వల్ల రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అలాగే జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. ఇంతేకాదు చర్మంపై ముడతలు, నల్లని మచ్చలు, కీళ్ల నొప్పులు, శరీర బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ ప్రోటీన్ లోపం కారణంగా పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరగరు. బ్రెయిన్ కూడా అభివృద్ధి చెందదు. దీనివల్ల మానసిక సమస్యలు వస్తాయి.