ఆవనూనెతో వంటలు చేసుకోమనేది ఇందుకోసమే..!

Published : Aug 14, 2022, 11:44 AM IST

ఆవనూనె మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఇది ఆకలిని పెంచడంతో పాటుగా కడుపులో మంటను తగ్గించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.   

PREV
19
ఆవనూనెతో వంటలు చేసుకోమనేది ఇందుకోసమే..!

ఆవ నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసిన వంటలు ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అందుకే భారతీయ వంట నూనెలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆవ నూనెను ఆవాల గింజల నుంచి తీస్తారు. అయితే ఈ నూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. 

29

దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. ఈ ఆవనూనెలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆవనూనెను వంటల్లో వేయడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

39

ఆకలిని పెంచుతుంది

ఆవనూనె ఆకలిని పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని ప్రేరేపిస్తుంది.
 

49

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఆవనూనెలో ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలతో పాటుగా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతో సహాయపడతాయి. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతాయి. 
 

59

మంటను తగ్గిస్తుంది

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో పాటుగా ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ఎఎల్ఎ) కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక రకమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లం. ఇది మంటను తగ్గించడానికి సహాయపడటమే కాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 

69

ఆవనూనెను ఉపయోగించడం జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మరే నూనెలు కూడా ఆవనూనె అన్ని ప్రయోజనాలు కలిగించవు. ఇవి జుట్టును నల్లగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. 
 

79

కోల్డ్ ప్రెస్డ్ లేదా చెక్కతో చేసిన ఆవనూనె డ్రై హెయిర్, చుండ్రు వంటి సమస్యలను తొలగిస్తుంది. ఆవనూనెలో ఉండే సెలీనియం జుట్టును బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లతో పాటు నెత్తిమీద ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆవనూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ జుట్టు తెల్లబడటాన్ని ఆపుతుంది. 
 

89

జలుబు, దగ్గు సమస్యలను తగ్గించడంలో ఆవనూనె ఎఫెక్టీవ్ పనిచేస్తుంది. ఇందుకోసం ఆవనూనెను గోరు వెచ్చగా చేసి అరికాళ్లకు, అరిచేతులకు సమాజ్ చేయాలి. ఈ నూనెతో ఆవిరి పట్టినా, ఛాతికి రాసినా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

99

మీరు తినే వంటల్లో ఆవనూనెను ఉపయోగించడం వల్ల బరువు పెరుగుతారనే భయం ఉండదు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే కొవ్వు నిల్వలను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మొత్తంగా గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories