Protein deficiency: వృద్ధాప్యంతో బలహీనంగా అవుతున్నారా..? అయితే వీటిని రోజూ తినండి బలంగా తయారవుతారు..

First Published Aug 14, 2022, 12:45 PM IST

Protein deficiency: వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. ఎముకలు, కండరాలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల తరచుగా అలసిపోతారు. దీంతో మీరు ఏం పనిచేయలేరు. దీనికి అసలు కారణం ప్రోటీన్ లోపమే. ఇలాంటి వారు తమ ఆహారంలో వీటిని రోజూ తినాలి. 
 

మనం తీసుకునే ఫుడ్ పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యాన్ని పాడు చేసే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ను తినడం వల్ల శరీరం  బలహీనంగా మారుతుంది. ఎందుకంటే వీటిలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఉండవు. దీంతో  శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల శరీరం బలహీనపడి ఎన్నో రోగాలకు ఆవాసంగా తయారవుతుంది. 
 

శరీరం బలంగా ఉండాలన్నా.. వివిధ రకాల వ్యాధులతో పోరాడాలన్నా.. శరీరంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. అయితే ఈ ప్రోటీన్ లోపం యువతలో కంటే  వృద్ధుల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీంతో వాళ్లు చాలా బలహీనంగా, అలసటగా ఉంటారు. శరీరం కూడా నొప్పి ఉంటుంది. ముఖ్యంగా కండరాలు, ఎముకలు బలహీనంగా మారుతాయి. అయితే ప్రోటీన్ ఫుడ్ ను తీసుకుంటే శరీరం బలంగా అవుతుంది. ఎముకలు, కండరాలు పటిష్టంగా తయారవుతాయి. 

protein

జుట్టు, గోర్లు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాదు శరీరంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటేనే హార్మోన్లు, ఎంజైమ్లు తయారవుతాయి. ఇవి శరీరంలో ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఒంట్లో ప్రోటీన్లు లోపిస్తే ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. 

గుడ్డు

గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యమైన ఖనిజాలు, వివిధ రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు గుడ్లలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా రక్షిస్తాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల ప్రోటీన్ లోపం పోతుంది. 
 

సోయాబీన్స్

సోయాబీన్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రోటీన్ లోపం పోవాలంటే రోజూ ఒక కప్పు ఉడకబెట్టిన సోయాబీన్స్ ను తినండి. అయితే వీటిలో కొవ్వు కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారు వీటిని తినకండి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. 

Skimmed milk

Skimmed milkలో ప్రోటీన్ కు మంచి వనరు. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పాలు లేదా పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే స్కిమ్డ్ పాలలో సాదా పాలలో కంటే ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. క్రమం తప్పకుండా స్కిమ్డ్ పాలను తాగడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. శరీరం కూడా బలంగా తయారవుతుంది. 
 

గ్రీకు పెరుగు (Greek yogurt)

ఇది ఒకరకమైన పెరుగు. దీనిలో మనం ఉపయోగించే పెరుగుకంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇది మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల ప్రోటీన్ లోపం పోయి.. శరీరం బలంగా తయారవుతుంది. 

click me!