స్కిప్పింగ్ లేదా వాకింగ్.. ఏది మంచిది
బరువు తగ్గాలనుకునేవారు ఆహార నియమాలు పాటించడంతో పాటూ వ్యాయామాలు కూడా చేయాలి. రోజూ సులభంగా చేయగలిగే వ్యాయామాల్లో వాకింగ్, స్కిప్పింగ్ ముఖ్యమైనవి. కానీ, శరీరంపై ప్రభావం, క్యాలరీలు బర్న్ చేసే వేగంలో ఈ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి.
వాకింగ్ చేయడం వల్ల లాభాలు
వాకింగ్ అనేది శరీరానికి ఎక్కువ ఒత్తిడి కలిగించని 'లో-ఇంపాక్ట్' వ్యాయామం. వయసు, ఫిట్‌నెస్‌ను బట్టి వేగాన్ని మార్చుకోవచ్చు కాబట్టి, చాలామంది దీన్ని రోజూ చేయగలరు. రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల శరీర కదలికలు పెరిగి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది బరువును అదుపులో ఉంచడానికి, ఎక్కువసేపు కూర్చునే అలవాటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బయట పార్కులో నడిస్తే మనసుకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అందుకే, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ వాకింగ్ మేలు చేస్తుంది.