కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలోని పొటాషియం స్థాయులను నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే, పండ్లలోని పొటాషియం పరిమాణం చాలా ముఖ్యం. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లు డ్రాగన్ ఫ్రూట్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కిడ్నీ వ్యాధి దశ, రక్తంలో పొటాషియం స్థాయి, వాడుతున్న మందుల ఆధారంగా ఎంత పరిమాణంలో తినాలో డాక్టరే నిర్ణయించాలి.
ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది సాధారణంగా సురక్షితమైన పండు. కానీ, అలర్జీలు ఉన్నవాళ్లు దీన్ని పూర్తిగా తినకూడదు. డయాబెటిస్, కిడ్నీ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, దీన్ని ఎంత మోతాదులో తినవచ్చో డాక్టర్‌తో మాట్లాడి తెలుసుకోవాలి.