Heart Health: మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలేంటే వీటిని తప్పక తినాల్సిందే..!

First Published Jun 28, 2022, 3:02 PM IST

Heart Health: ఒకప్పుడు గుండె జబ్బులు పెద్దవయసు వారికే వచ్చేవి. ఇప్పుడు కాలం మారింది. చిన్న వయసు వారుసైతం గుండె జబ్బులతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. ఈ సమస్యలను రాకూడదంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

కాలం ఎంతగా మారిపోయిందంటే.. కనీసం మనశ్శాంతిగా తినడానికి  కూడా సమయం లేనంతగా తయారైంది. దీనికి తోడు మాససిక సమస్యలు, పని ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. వీటివల్ల కంటినిండా నిద్రపోవడం లేదు సరికదా.. మనశ్శాంతిగా తినలేపోతున్నారు కూడా. 
 

heart health

ఈ అలవాట్ల వల్లే ఎక్కడ లేని రోగాలు చుట్టుకుంటున్నాయి. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల  శరీరంలో పోషకాలు, ఖనిజాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా  గుండెజబ్బులు, మధుమేహం వంటి రోగాలు వస్తాయి. ఇలాంటి రోగాలు రాకూడదంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలి. అవేంటంటే.. 

మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరమవుతాయి. అందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ వంటివి తప్పకుండా ఉండాలి. వీటివల్లే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విటమిన్లు లభించే ఆహారాలను ఎక్కువగా తినండి. అప్పుడే పోషకాహార  లోపం పోయి మీ గుండె ఫిట్ గా ఉంటుంది.


ఫోలిక్ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది బ్రెయిన్ ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. అలాగే రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాటుగా రక్తహీనత సమస్యను కూడా తొలగిస్తుంది. 

ఒమేగా 3ఫ్యాటీ ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మన రోజు వారి ఆహారంలో తప్పకుండా ఉండాలి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె జబ్బులను తగ్గిస్తాయి. అలాగే గుండెను ఫిట్ గా ఉంచుతాయి. అంతేకాదు ఇవి ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఐరన్ మన బాడీకి చాలా అవసరం. ఐరన్ ఎన్నో సమస్యను తగ్గిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచడంతో పాటుగా రక్తహీనత సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది. ఐరన్ మనం రోజంతా శక్తవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. 

జింక్ మన శరీరానికి కావాల్సిన పోషకాల్లో ఒకటి. జింక్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంుది. ఇది అధిక రక్తపోటు, ఉబ్బసం వంటి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.  
 

click me!