Vision Loss: ఈ విటమిన్లు పూర్తిగా తగ్గితే.. గుడ్డి వారవుతారు జాగ్రత్త..

Published : Jul 09, 2022, 11:15 AM IST

Vision Loss: మన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు చాలా అవసరం. ఇవి శరీరంలో సరిపడా ఉంటేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏ ఒక్క విటమిన్ తగ్గినా.. శరీరంలో ఏదో ఒకభాగం దెబ్బతినే ప్రమాదం ఉంది.   

PREV
110
Vision Loss: ఈ విటమిన్లు పూర్తిగా తగ్గితే.. గుడ్డి వారవుతారు జాగ్రత్త..

మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే.. విటమిన్లు, ఖనిజాలను ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి శరీర పనితీరును సులభతరం చేస్తూ.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలను బలంగా ఉంచడం నుంచి అంటువ్యాధులతో పోరాడటం, మెదడు, హార్మోన్ల విధులను నియంత్రించడం వరకు పోషకాలే కీలక పాత్ర పోషిస్తాయి. 

210

సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి జబ్బులూ వచ్చే అవకాశం కూడా ఉండదు. కానీ బిజీ లైఫ్ కారణంగా నేడు ఎంతో మంది పోషకాహారం తీసుకోవడం బొత్తిగా మర్చిపోయారు. 
 

310

విటమిన్లు లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి.. 

మన శరీరానికి 13 రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వీటిని వివిధ రకాల ఆహారాల ద్వారా పొందొచ్చు. ఒకవేళ మన శరీరంలో విటమిన్లు లోపిస్తే శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

శరీరానికి అవసరమైన మొత్తంలో విటమిన్లు (తక్కువ మొత్తంలో ఉంటే) లేకపోవడాన్నే విటమిన్ లోపం ఉంటారు. దీనివల్ల శరీరం బలహీనంగా మారుతుంది. చికాకు, ఎముకల్లో బలం లేకపోవడం, అలసట, మైకము, తరచుగా గాయాలు అవడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ల లోపం వల్ల ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. 
 

410

దృష్టి నష్టానికి దారితీసే విటమిన్లు

రెండు రకాల విటమిన్ లోపాలు దృష్టి నష్టానికి దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి విటమిన్ ఎ అయితే రెండోది విటమిన్ బి12 లోపం. ఈ రెండు విటమిన్ల లోపాలు కంటిచూపును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే దృష్టి నష్టం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 
 

510

ఏడాదికి 2,50, 000 నుంచి 5,00, 000 మంది పిల్లలు విటమిన్ ఎ లోపంతో చూపును కోల్పోతున్నారని తెలిపింది. ఇక వీరిలో సగం మంది చూపు కోల్పోయిన పిల్లలు 12 నెలల్లోనే చనిపోతున్నారని అంచనా వేయబడిందని global health agency తెలుపుతుంది. 

610

ఇకపోతే విటమిన్ బి 12 నాడీ కణాల పనితీరు, మెదడు పనితీరుకు అవసరమైన అత్యవసర పోషకం. ఇది లోపించడం వల్ల మెదడు సరిగ్గా పనిచేయకపోవడమే కాదు.. కంటిచూపుకోల్పోయే ప్రమాదానికి కూడా దారితీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

710

విటమిన్ ఎ తక్కువగా ఉంటే కనిపించే లక్షణాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. విటమిన్ ఎ లోపం వల్ల పిల్లల్లో కనిపించే మొదటి సంకేతాల్లో రాత్రి ఆంధత్వం ఒకటి. ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర లక్షణాలేవంటే.. కళ్లు  పొడిబారడం, పిల్లల ఎదుగుదల లేకపోవడం, చర్మం దురద పెట్టడం, పెద్దవారిలో అయితే  సంతానోత్పత్తి, సంక్రామత్య వంటి సమస్యలు కనిపిస్తాయి. 

 

810

విటమిన్ బి12 లోపాన్ని ఇలా గుర్తించాలి

చర్మం పసుపురంగులోకి మారడం, లేతగా తయారవడం, నాలుక, గొంతులో పుండ్లు ఏర్పడటం, ఎరుపు రంగులోకి మారడం, నోటి వాపు, కంటిచూపు మందగించడం. సూదులతో పొడిచినట్టుగా అనిపించడం, నడకలో మార్పు, చంచలమైన మనస్సు, ఆలోచనలు నిలకడగా లేకపోవడం, డిప్రెషన్, చేసే పనుల్లో మార్పు, జ్ఞాపకశక్తి కోల్పోవడం , విషయాలను అర్థం చేసుకోలేక పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. 
 

910

విటమిన్ ఎ, విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాలు

కొవ్వుగల చేపలు, గుడ్లు, పాలు, జున్ను, పెరుగు , కాలెయ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఈ విటమిన్లు ఉంటాయి. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. చిలగడదుంపలు, బచ్చలికూర, ఎర్ర మిరియాలు, క్యారెట్లు, ఎరుపు, పసుపు రంగులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, బొప్పాయి. మామిడి వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి. 
 

1010

శరీరంలో విటమిన్లు లోపించాయని ఎలా తెలుసుకోవాలి: ఒక వేళ మీ శరీరంలో విటమిన్ లోప లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్ష చేయించుకోండి.  రక్తపరీక్ష ద్వారా విటమిన్ లోపాలను సులువుగా తెలుసుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories