Weight loss: బరువు తగ్గేందుకు ఆలియా భట్ తినే ఆహారాలు ఇవే.. మీరూ ట్రై చేయండి..

First Published | Jul 9, 2022, 10:11 AM IST

Weight loss: ఆహారాలు కేవలం ఆకలిని తీర్చడానికే కాదు.. బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. అలాంటి ఆహారాలనే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా తింటుంది. మరి ఈ హీరోయిన్ తినే ఆహారాలేంటి.. అవెలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దక్షణ భారతదేశ వంటకాలు కేవలం రుచికరంగానే కాదు.. బరువును తగ్గించేకుందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా ఈ వంటల్లో కేలరీలు చాలా తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే ఇవి బరువు తగ్గేందు బెస్ట్ వంటకాలంటారు నిపుణులు. అందుకే కదా చాలా మంది హీరో హీరోయిన్లు ఈ వంటకాలనే తింటుంటారు. అంతెందుకు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా బరువు తగ్గేందుకు దక్షిణ భారతదేశ వంటకాలనే తింటుంది. ఈ అమ్మడు తినే ఆ వంటకాలేంటి, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Zucchini sabzi recipe by Alia Bhatt

సౌత్ ఇండియన్ స్టైల్ జుచినీ (zucchini)

రెగ్యులర్ గా జుచినీ తినడం వల్ల చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఎందుకంటే దీనిలో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఈ ఫుడ్ ను ఆలియా భట్ ఇష్టంగా తింటుంది. మరి దీన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 


ముందుగా ఒక జుచినీని తీసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దానిలో 1/2  టేబుల్ స్పూన్ల నూనె పోసి.. అది వేడి అయ్యాక అందులో 1/4 స్పూన్ల నల్ల ఆవాలు వేయాలి. ఆ తర్వాత రెండు టీస్పూన్ల ఇంగువ , ఒకటి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకులు వేసుకోవాలి. కొంచెం సేపయ్యాక  పీసెస్ గా కట్ చేసిన జుచినీ వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలగలిపి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. 

ఆ తర్వాత దానిలో 1/2  టీస్పూన్ల దనియాల పొడిని 1/4 టీస్పూన్ల  జీలకర్ర పౌడర్ ను, 1/4 టీస్పూన్ల సోంపు పొడిని, 1/4 టీస్పూన్ల ఎండు మామిడి పొడిని వేడి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో తురిమిని కొబ్బరిని 2 టీస్పూన్లు, కొత్తిమీర తరుగును 1/2 వేసి కాసేపు కలగలిపేసి దించేయాలి. అంతే వేడి వేడి జుచినీ రెసిపీ రెడీ అయినట్టే.. 
 

కీటో ఉప్మా (Keto Upma)..

కీటో ఉప్మాను రెడీ చేయడం చాలా సులువు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూడా. దీనిని కాలీఫ్లవర్ రైస్ తో తయారుచేస్తారు. దీనిలో పిండిపదార్థాలు, కేలరీలు తక్కువుగా ఉంటాయి. గ్లూటెన్ కూడా ఉండదు. ఇది అచ్చం రవ్వ ఉప్మాలానే అవుతుంది. దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కాలీఫ్లవర్ ను వీలైనంత సన్నగా తరుముకోండి. అచ్చం ఇది రవ్వను పోలి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక బాణలీ స్టవ్ పై పెట్టుకుని అందులో టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను పోయండి. అది వేడి అయ్యాక ఆవాలు వేయండి. ఆవాలు అయ్యాక అందులో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి కొన్ని సెకన్ల పాటు వేగించండి. ఇందులో ఉల్లిపాయలు వేసి బాగా ఉడికించండి.  ఆతర్వాత అందులో పచ్చి బీన్స్, బ్రోకలీ, బెల్ పెప్పర్, పుట్టగొడుగులు వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించండి.  ఆ తర్వాత దానిలో తరిగిపెట్టుకున్న కాలీఫ్లవర్ ను వేసి.. రుచికి తగ్గ ఉప్పును వేసి కలగలపండి. స్టవ్ ను మీడియంలో పెట్టుకుని అందులో కొన్ని నీళ్లు పోసి నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించండి. దీన్ని మధ్య మధ్యలో కలుపి.. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు తురిమిన కొబ్బరి, కొత్తిమీర, నిమ్మరసం వేసి గార్నిష్ చేయండి. 

రసం (Rasam)

బరువు తగ్గేందుకు రసం కూడా ఎంతో సహయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు గ్యాస్ట్రోప్రొటెక్టీవ్ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ రసాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ముందుగా కొద్దిగా చింతపండును తీసుకుని 1/2 కప్పు గోరువెచ్చని నీళ్లలో 30 నిమిషాల పాటు నానబెట్టండి. దాన్ని గుజ్జుగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి.  ఆ తర్వాత మూడు టీస్పూన్ల జీలకర్ర, నల్ల మిరియాలను 2 టీస్పూన్లు, 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి.  ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి.. వేడి అయ్యాక ఆవాలు  1 టీస్పూన్, 2 ఎండుమిర్చీలు, కరివేపాకు రెబ్బలు, రెండు చిటికెల ఇంగువ వేసి బాగా కలపండి. ఆ తర్వాత అందులో 1/2 కప్పుల తరిగిన టొమాటో ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న మసాలను వేసి కలపండి. ఆ తర్వాత దీనిలో చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లను వేయండి. దీన్ని సన్నని మంటపై ఉడకనీయండి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేడి స్టవ్ ను ఆఫ్ చేయండి. 
 

Latest Videos

click me!