Spectacles: కళ్ల జోడును శుభ్రం చేయడానికి తిప్పలు పడుతున్నారా? అయితే.. కళ్ల జోడును పది నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి తీస్తే… కొత్త దానిలా మెరిసిపోతుందంట. ఇందులో నిజమెంత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వెనక నిజం ఎంత?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. సాధారణంగా ఫ్రిజ్ లో కూరగాయలు, పాలు, వండిన పదార్థాలు స్టోర్ చేస్తూ ఉంటాం. కానీ, ఎప్పుడైనా ఫ్రిజ్ లో కళ్ల జోడు పెట్టి చూశారా? ఎవరైనా ఫ్రిజ్ లో కళ్ల జోడు పెడతారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ.. అలా పెడితే.. మీ పాత కళ్ల జోడు కొత్తదానిలా మెరిసిపోతుందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియో ప్రకారం, కళ్లజోడును ఈజీగా ఎలా శుభ్రపరచాలో అందులో చూపించారు. ఈ విషయమై ప్రస్తుతం ఇంటర్నెట్ లో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో.. ఇప్పుడు తెలుసుకుందాం..
24
పాత కళ్లజోడును కొత్తదానిలా...
వైరల్ వీడియోలో ఓ మహిళ తాను వాడే కళ్లజోడును ఫ్రిజ్ లోని ఫ్రీజర్ లో పది నిమిషాల పాటు పెట్టింది. ఆ తర్వాత దానిని బయటకు తీసి, మెత్తటి, శుభ్రమైన క్లాత్ తో తేలికగా.. తుడిచింది. ఇలా చేయగానే.. కళ్లజోడు కొత్త దానిలా మెరుస్తూ కనిపించడం విశేషం.
వీడియోలో మహిళ మాట్లాడుతూ.. కళ్లజోడును ఫ్రీజర్ లో పెట్టడం వల్ల.. అద్దాలపై ఉన్న దుమ్ము, మరకలు, జిడ్డు అన్నీ ఈజీగా తొలగిపోతాయని, పెద్ద కష్టం లేకుండా.. కొత్త వాటిలా కనపడతాయని ఆ మహిళ చెప్పడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది.
34
యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్
ఈ సింపుల్ ట్రిక్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొందరేమో ఇంట్లో ట్రై చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు దీని భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఫ్రిజ్ లో పెడితే.. కళ్లజోడు పాడైపోతుంది కానీ, కొత్త దానిలా ఎందుకు కనిపిస్తుంది అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను 'అవికా రావత్ ఫుడ్స్' (Avika Rawat Foods) అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయగా, ఇప్పటికే లక్షలాది మంది చూశారు.
ఈ కథనంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఆధారపడింది. ఈ చిట్కాకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, నిపుణులు కూడా దీన్ని ధృవీకరించలేదు. కాబట్టి, మీ ఖరీదైన కళ్లజోడుపై ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం లేదా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని