Money Plant Vastu: మనీ ప్లాంట్ ని ఏ రోజున, ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?

Published : Sep 10, 2026, 01:31 PM IST

Money Plant Vastu: చాలామంది ఇళ్లల్లో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్‌ని పెంచుతుంటారు. వాస్తు ప్రకారం, ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. సరైన రోజు, సరైన దిక్కులో పెడితేనే మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి మనీ ప్లాంట్ వాస్తు గురించి చూద్దామా...

PREV
15
మనీ ప్లాంట్ వాస్తు టిప్స్

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ, సుఖశాంతులు ఉంటాయని నమ్మకం. కానీ, ఈ మొక్కను తప్పుడు దిశలో లేదా తప్పుడు రోజున నాటితే ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి మనీ ప్లాంట్ పూర్తి ప్రయోజనం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

25
మనీ ప్లాంట్ ఏ రోజు నాటాలి?

జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ నాటడానికి శుక్రవారం చాలా మంచి రోజు. శుక్రవారం సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మికి అంకితమైన రోజు.అంతేకాదు, శుక్రవారం శుక్ర గ్రహానికి కూడా సంకేతం. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే సుఖభోగాలు పెరుగుతాయి. అందుకే శుక్రవారం మనీ ప్లాంట్ నాటితే లక్ష్మీదేవి దయతో ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

35
ఏ దిక్కులో పెట్టాలి?

మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో మాత్రమే పెట్టాలి. ఆగ్నేయ దిశకు గణపతి అధిపతి. శుక్ర గ్రహం ఈ దిక్కుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆగ్నేయంలో ఈ మొక్కను పెట్టడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీతో పాటు డబ్బు ప్రవాహం పెరుగుతుందని పండితుల సూచిస్తున్నారు.

45
ఎక్కడ పెట్టకూడదు?

మనీ ప్లాంట్‌ను పొరపాటున కూడా ఈశాన్యం దిక్కులో పెట్టకూడదు. ఈశాన్య దిశకు అధిపతి గురు గ్రహం. జ్యోతిష్యం ప్రకారం గురు, శుక్ర గ్రహాలు ఒకరికొకరు శత్రువులు. కాబట్టి ఈశాన్యంలో మనీ ప్లాంట్ పెడితే ఇంట్లో గొడవలు, అశాంతి, భారీ ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.

55
తప్పక పాటించాల్సిన ముఖ్య నియమాలు

తీగ నేలను తాకవద్దు: 

మనీ ప్లాంట్ తీగలు నేల మీద పాకకూడదు. ఇది ఆర్థిక పతనానికి సంకేతం. తీగ ఎప్పుడూ పైకి పెరిగేలా దారం లేదా కర్రతో ఆధారం ఇవ్వాలి.

ఎండిన ఆకులు తీసేయాలి:

మొక్క ఆకులు పసుపు రంగులోకి మారినా లేదా ఎండిపోయినా వెంటనే వాటిని కత్తిరించి తీసేయాలి. ఎండిన ఆకులు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని తెస్తాయి.

బహుమతిగా ఇవ్వొద్దు: 

మనీ ప్లాంట్‌ను ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి అదృష్టాన్ని లేదా లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లే. పండితుల ప్రకారం.. శుక్రవారం రోజు ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటి, ఈ సులభమైన వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో ఆర్థిక స్థిరత్వం, సుఖశాంతులు నెలకొంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories