అక్కడ దురద పెడుతోందా? తగ్గాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..

Published : Dec 30, 2022, 03:03 PM IST

దురద జననేంద్రియల్లో ఇబ్బందిని కలిగిస్తుంది. చిరాకు, ఇబ్బంది, ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.   

PREV
16
అక్కడ దురద పెడుతోందా? తగ్గాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
vaginal health

యోని ప్రాంతంలో దురద థ్రష్ వంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీనివల్ల అక్కడ తీవ్రమైన దురద వల్ల లాబియా,  క్లిటోరిస్ వాపు వస్తుంది. అక్కడ ఎక్కువ సేపు దురద రావడానికి మాత్రం సరైన పరిశుభ్రత లేకపోవడం వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దురద తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి. 

26

కాటన్ లో దుస్తులు ధరించండి

కాటన్ లో దుస్తులు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే కాటన్ లో దుస్తులు తగినంత వెలుతురును అందిస్తాయి. అలాగే చర్మానికి గాలి బాగా అందుతుంది. దీనివల్ల అక్కడ చెమట పెట్టే ప్రమాదం ఉండదు. చెమటను గ్రహించే లో దుస్తులను వేసుకుంటే తేమ పెరగదు. అలాగే పీరియడ్స్ సమయంలో వేసుకునే లో దుస్తులను.. ఇతర సమయంలో వేసుకునే లో దుస్తులను వేరు వేరుగా ఉంచండి. అవసరాన్ని బట్టి లోదుస్తులను మార్చుతూ ఉండాలి. 

36

యోనిని తేమగా ఉంచండి

ఇదికాస్త విచిత్రంగా అనిపించొచ్చు. కానీ యోని ప్రాంతాన్ని రోజూ తేమగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతం చాలా సున్నితమైనది. అందుకే అక్కడ పొడిబారకుండా ఉండటానికి కొబ్బరి నూనె లేదా ఏదైనా సువాసన లేని మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. కానీ ఓవర్ గా పెట్టకండి. ముఖ్యంగా యోని లోపల పెట్టకండి. 
 

46

మంచి బ్యాక్టీరియాను పెంచండి

ఆ భాగంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి.. ప్రోబయోటిక్ ఆహారాలు, వెల్లుల్లి, సిట్రస్ ఆహారాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను, క్రాన్బెర్రీస్ వంటి ఆహారాలను తప్పకుండా తీసుకోండి. అంటువ్యాధులు, దురదను నివారించడానికి ఈ ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆహారాలు సన్నిహిత ఆరోగ్య సమస్యలకు దారితీసే చెడు బ్యాక్టీరియా పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
 

56

ప్యాడ్లను తరచుగా మార్చండి

టాంపోన్లు, మెనుస్ట్రువల్ కప్పులను చొప్పించడానికి ముందు, తర్వాత చేతులను శుభ్రం చేసుకోండి. అలాగే ప్రతి 4 నుంచి 5 గంటలకు ప్యాడ్లను, టాంపూన్లను మార్చండి. అలాగే దురదను నివారించడానికి మీరు బాత్రూమ్ కు వెళ్ళిన ప్రతిసారీ యోని ప్రాంతాన్ని శుభ్రం చేయండి. దీనివల్ల ప్యాడ్ దద్దుర్లు, దుర్వాసన సమస్యలు ఉండవు. 
 

66

రసాయన ఆధారిత క్లెన్సర్లను నివారించండి

యోని శుభ్రపరిచే అవయవం.  అందుకే చాలా మంది వైద్యులు యోనిని శుభ్రపరిచే వాష్ ఉపయోగించాలని చెప్తుంటారు. కానీ రసాయనన ఆధారిత క్లెన్సర్లను ఉపయోగిస్తే.. యోని పిహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. మీరు యోనిని శుభ్రపరిచేందుకు ఉపయోగించే సబ్బులో రసాయనాలు లేవని నిర్ధారించుకోండి.
 

Read more Photos on
click me!

Recommended Stories