Dried Lemon: ఎండిన నిమ్మకాయలను చాలా మంది బయటపడేస్తారు. నిజానికి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. వాటిలోని సహజ ఆమ్లాలు ఎండిపోయినా కూడా వాటిలోనే ఉంటాయి. ఇంటిని మెరిపించేందుకు ఎండిన నిమ్మకాయలను ఎలా వాడాలో తెలుసుకోండి.
ప్రతి ఇంట్లో నిమ్మకాయలను అధికంగానే వాడుతాం. కొన్నిసార్లు అవి వాడకుండా అలా ఉండిపోయి వాడి ఎండిపోయినట్టు అవుతాయి. ఫ్రిజ్ లో పెట్టిన కూడా రెండు వారాల తరువాత అవి ఎండిపోతాయి. చాలా మంది అవి పనికిరావని బయటపడేస్తారు. నిజానికి ఎండిన నిమ్మకాయలు పడేయాల్సిన అవసరం లేదు. వాటిని తెలివిగా ఇంటి క్లీనింగ్ కోసం ఉపయోగపడతాయి. వాటిలోని సహజ ఆమ్లాలు ఇంటి పనులకు బాగా పనికొస్తాయి.
24
పాత్రలు, సింక్ శుభ్రం చేయడానికి
ఎండిన నిమ్మకాయ సహజ క్లీనర్‌గా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఉన్న స్టీల్ లేదా రాగి పాత్రలపై కొద్దిగా ఉప్పు వేసి ఎండిన నిమ్మ ముక్కతో బాగా రుద్దాలి. ఇలా చేస్తే వాటిపై ఉన్న మొండి మరకలను తొలగిస్తుంది. వాటిని మెరిసేలా చేస్తుంది. ఎండిన నిమ్మకాయతో సింక్‌ను రుద్ది శుభ్రం చేసుకోచవ్చు. ఇది చాలా ఉపయోగకరమైన చిట్కా.
34
వంటగది కోసం
ఎండిన నిమ్మకాయను రెండు ముక్కలు చేసి స్టవ్ మీద లేదా మైక్రోవేవ్‌లో కాసేపు వేడి చేయండి. అప్పుడు నిమ్మ నుంచి మంచి సువాసన వస్తుంది. ఇది వంటగదిలోని చెడు వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది.
అలాగే ఎండిన నిమ్మ ముక్కలను దాల్చినచెక్క, కర్పూరం, లవంగాలతో కలిపి ఒక చిన్న పలుచటి నెట్ సంచిలో ఉంచాలి. ఆ సంచిని బాత్రూమ్, కారులో పెడితే మంచిది. దీని నుంచి నెమ్మదిగా వాసన బయటికి వస్తుంది.
నిమ్మ నుంచి వచ్చే వాసన చాలా చీమలు, పురుగులు, కీటకాలకు నచ్చదు. ఈ ఎండిన నిమ్మకాయ ముక్కలను ద్వారం దగ్గర లేదా వంటగది మూలల్లో ఉంచడం వల్ల కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఎండిన నిమ్మకాయను పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడిని పెరుగు లేదా కలబంద గుజ్జుతో కలిపి హెయిర్ ప్యాక్ లా వేసుకోవచ్చు. ఇది తలపై చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చుండ్రుతో బాధపడుతున్న వారికి ఇది మంచి చిట్కా. వెంట్రుకలకు మంచి మెరుపును ఇస్తుంది.
అలాగే ఎండిన నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోయండి. దాన్ని ఒక కాటన్ గుడ్డలో కట్టి మీ వార్డ్‌రోబ్ లేదా బూట్లు పెట్టే చోట ఉంచండి. ఇది అక్కడ చెడు వాసనను పీల్చేస్తుంది. అలాగే తేమను కూడా పీల్చేస్తుంది.