Weight Loss Problem: ఫాస్ట్ గా బరువు తగ్గుతున్నారా? అయితే జాగ్రత్త.. మీకు ఈ రోగాలు వచ్చుంటాయి..

First Published Aug 13, 2022, 11:52 AM IST

Weight Loss Problem: సన్నని.. నాజూకైన శరీరం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం వ్యయామాలు చేస్తుంటారు. అయితే వేగంగా బరువు తగ్గడం ఎన్నో రోగాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 

ఈ రోజుల్లో చాలా మందికి బొద్దుగా ఉండటం అస్సలు ఇష్టం ఉండటం లేదు. అందుకే పెరిగిన బరువును తగ్గించుకుంటూ.. స్లిమ్ గా, ఫిట్ గా తయారవుతున్నారు. స్లిమ్ గా కనిపించేందుకు ఎన్నో పద్దతులను అనుసరిస్తున్నారు. కొందరు జిమ్ కు వెళితే.. మరికొంతమంది మాత్రం డైట్ ను ఫాలో అవుతున్నారు. 

సన్నగా మారడం మనకు హ్యాపీగానే అనిపించినా.. ఇది ఎన్నో రోగాలకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును వేగంగా బరువు తగ్గినట్టైతే మీరు ఎన్నో రోగాల బారిన పడొచ్చంటున్నారు నిపుణులు. ఇలా మీకు కూడా జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

తక్కువ బరువు ఈ వ్యాధులకు సంకేతం..

హైపర్ థైరాయిడ్ (Hyperthyroidism)

ఈ రోజుల్లో థైరాయిడ్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. దీనివల్ల కొంతమంది వేగంగా బరువు పెరిగితే మరికొంతమంది మాత్రం వేగంగా బరువు తగ్గుతారు. థైరాయిడ్ సమస్య వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేయదు. దీనివల్ల బరువు తగ్గడం మొదలవుతుంది.  థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఇది ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుంది. దీనికి తక్షణమే చికిత్స తీసుకోవడం చాలా అవసరం. 

పొటాషియం అధికంగా ఉండటం

మనం తీసుకునే ఆహారం ద్వారానే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వీటివల్ల ఒక్కోసారి శరీరంలో పోషక లోపం లేదా అధిక పోషకాలు వంటి సమస్యలు కలుగుతాయి. శరీరంలో పోషకాలు లోపిస్తే ఎన్నో రకాల రోగాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు శరీరంలో పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటే కూడా శరీరానికి నష్టం కలుగుతుంది. ఇది నీటి నష్టాన్ని కలిగిస్తుంది. అంటే దీనివల్ల ఒంట్లో నీరు నిల్వ ఉండదు. మూత్రం, చెమట రూపంలో నీరంతా బయటకు పోతుంది. ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
 

ఇది క్యాన్సరా? 

ఉన్నట్టుండి బరువు తగ్గడం క్యాన్సర్ ప్రధాన లక్షణాలలో ఒకటిగా ఉంది. అయితే క్యాన్సర్ బారిన పడ్డవాళ్లు అకస్మత్తుగా బరువు తగ్గడమే కాదు.. వారిలో రోగ నిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. అందుకే వేగంగా బరువు తగ్గుతున్నట్టైనే జాగ్రత్తగా ఉండండి.
 

డయాబెటీస్ ప్రమాదం

డయాబెటీస్ బారిన పడితే కూడా వేగంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గడం షుగర్ వ్యాధి ప్రధాన లక్షణం కూడాను. షుగర్ బారిన పడితే వారి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీనివల్ల కణాలకు శక్తి అందదు. దీనివల్ల శరీరానికి శక్తి అందకపోవడం వల్ల శరీరం విపరీతంగా అలసిపోతుంది. దీనివల్ల ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.   
 

click me!