ఆరోగ్యంగా ఉండాలని జీడిపప్పును రోజూ తింటున్నారా..? అదెంత ప్రమాదమో తెలుసా..?

First Published Aug 13, 2022, 10:43 AM IST

జీడిపప్పును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీడిపప్పు మరెన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తున్నప్పటికీ ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. 
 

Cashew Nut

జీడిపప్పులు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. 

జీడిపప్పులు బరువును తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ పప్పులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి.
 

జీడి పప్పుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. జీడిపప్పులు జుట్టు, చర్మానికి పోషణను కూడా అందిస్తాయి. 
 

అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. జీడిపప్పుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా జీడి పప్పులను రెగ్యులర్ గా తినే వాళ్లు కొన్ని అనారోగ్య సమస్యలను ఫేస్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు జీడిపప్పులను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది. ఆక్సలేట్ అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం శోషణకు దారితీస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు మరిన్ని పెరుగుతాయి.

కొంతమందికి జీడిపప్పులను తింటే అలెర్జీ అవుతుంది. దీంతో పొత్తికడుపు నొప్పి, వికారం, నోరు వాపు లేదా ఆహారం మింగడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి జీడిపప్పు అలెర్జీ ఉన్నవారు వీటిని తినకపోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 

అలెర్జీ సమస్య ఉన్నవారు జీడిపప్పులను తింటే వాంతులు, దగ్గు వంటి సమస్యలు కలగొచ్చు. అందుకే వీళ్లు జీడిపప్పులను చాలా తక్కువగా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. 

జీడిపప్పులను తినడం వల్ల చాలా మందికి శ్వాస సమస్యలు కలుగుతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. లేదంటే ప్రాణాల మీదికి రావొచ్చు. 

ఇలా అని జీడిపప్పులను మొత్తమే తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్పడం లేదు. ఈ సమస్యలు ఉన్నవారు మాత్రమే జీడిపప్పులకు దూరంగా ఉండాలి. అయితే వీళ్లు జీడిపప్పులను రెండు మార్గాల్లో తింటే ఎలాంటి సమస్యలూ ఉండవు. జీడిపప్పు పాలు తయారుచేసుకుని తాగొచ్చు. దీనికోసం 2 కప్పుల జీడిపప్పులను తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లను కలపండి. దీన్ని మిక్సీ పట్టి తాగండి. లేదా 2 కప్పుల జీడిపప్పును తీసుకుని 1 కప్పు కొబ్బరినూనె, చిటికెడు ఉప్పును తీసుకోండి. ముందుగా జీడిపప్పులను వేయించండి. తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. దీనికి తేనెను కలపండి. జీడిపప్పును ఇలా తింటే ఎలాంటి సమస్యలు రావు. 

click me!