Period Pain: పీరియడ్స్ నొప్పిని భరించలేకపోతున్నారా? ఈ ఆయుర్వేద టిప్స్ మీ కోసమే..

Published : Feb 20, 2022, 04:35 PM IST

Period Pain:పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఆ నొప్పిని భరించడం అంత సులువు కాదు. ఈ నొప్పినుంచి ఉపశమనం కలిగించేందుకు టాబ్లెట్లను వేసుకుంటారు. దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా కూడా ఈ నొప్పినుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

PREV
18
Period Pain: పీరియడ్స్ నొప్పిని భరించలేకపోతున్నారా? ఈ ఆయుర్వేద టిప్స్ మీ కోసమే..
periods health tips

Period Pain: నెలసరి సమయంలో అందరి మహిళల పరిస్థితి ఒకేలా ఉండదు. కొంతమందికి ఆ సమయంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోకున్నా.. మరికొంతమంది మాత్రం దాని వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమందికి  రక్తస్రావం ఎక్కువగా అయితే మరికొంతమందికేమో దీనితో పాటుగా విపరీతమైన కడుపునొప్పి కూడా వేధిస్తుంటుంది. ముఖ్యంగా విపరీతమైన పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఈ నొప్పి సుమారుగా రెండు మూడు రోజులుండే అవకాశముంది. ఈ నొప్పిని తట్టుకోలేక చాలా మంది ఆడవారు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. 
 

28

కానీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ప్రతినెలా వేసుకోవడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను చిట్కాలను పాటిస్తే ఈ పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

38

నొప్పిని తగ్గించేందుకు సోంపు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి విపరీతమైన కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు సోంపు గింజలతో టీని తయారుచేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 

48

నువ్వుల నూనెతో భరించలేని కడుపునొప్పి సమస్యకు చెక్ పెట్టొచట. దీనికోసం.. నువ్వుల నూనెను పొట్ట చూట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. 

58

భరించలేని నొప్పిని నుంచి ఉపశమనం పొందాలంటే పోపులో వేసే జీలకర్రను, సోంపులను వాడితే కూడా చక్కటి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

68

మీకు రోజూ వర్కౌట్స్ చేసే అలవాటున్నా.. నెలసరి సమయంలో మాత్రం ఈ వ్యాయామాలకు దూరంగా ఉండండి. హెవీ వర్కౌట్స్ చేస్తే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. 
 

78

వంటల్లో మీరు రోజు వాడే నూనెకు బదులుగా నువ్వుల నూనెనే  వాడండి. దీనివల్ల మీ కడుపు నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

88

ఎక్కువ స్వీట్ గా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా చక్కెర అధికంగా వాడే ఆహారాలను అస్సలు తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories