ఇలా చేస్తే విడిపోయిన ప్రేమికులు మళ్లీ ఒకటవుతారట..

First Published | Feb 20, 2022, 4:02 PM IST

Relationship Tips: అనుకోని కారణాల వల్ల ఒకరికి ఇష్టం ఉన్నా మరొకరు ఆ రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్తుంటారు. కానీ కొన్ని పనులు చేస్తే మనల్ని కాదని వెళ్లిపోయిన వారు మీ చెంతకు వస్తారట. ఇందుకోసం మరి మీరేం చేయాలో ఇపుుడు తెలుసుకుందాం..

Relationship Tips: అనుకోని కారణాల వల్ల చాలా మంది లవర్స్ విడిపోతున్నారు. ఇలా విడిపోవడం ఎంతో బాధనుకలిగిస్తుంది కాదా. సంవత్సరాల తరబడి కలిసి సంతోషంగా ఉండి ఒక్కసారిగా విడిపోవడం ఎంతో బాధను కలిగించే విషయం. మళ్లీ ఆ రిలేషిప్ లో ఉండే ఎవరో ఒవరు తమ ప్రియుడు లేదా ప్రేయసి తిరిగి తమదక్కరికి వస్తే ఎంత బావుంటుందో కదా అని కలలు గంటారు. అలా జరగాలంటే మీరు కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది. ఈ టిప్స్ ను పాటించినట్టైతే మిమ్మల్ని కాదనుకుని వెళ్లిపోయిన మీ ప్రియురాలు మళ్లీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇందుకోసం మీరేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
 

సోషల్ మీడియాను బాగా వాడండి: సోషల్ మీడియా ట్రిక్ ను వాడితే ఖచ్చితంగా మీ లవర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వాళ్లు విడిపోయినా మీరేం బాధపడటం లేదనట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. వీటిని వాళ్లు చూస్తే బాధగా అనిపిస్తుంది. దాంతో వాళ్లు తిరిగి మీ వద్దకు రావాలనుకుంటారు.
 


love

రివర్స్ సైకాలజీ: మీ నుంచి విడిపోయిన వారు మిమ్మల్ని ఏడిపించేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా మీరు ఏడ్చేలా ఉండే ఏదైన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దానికి మీ నుంచి రియాక్షన్ వస్తదని భావిస్తారు. కానీ మీరు ఇక్కడే రివర్స్ సైకాలజీని ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ లకు మీరు ఎటువంటి రిప్లై ఇవ్వకండి. వాటిని స్కిప్ చేయండి. దాంతో వాళ్లు దీన్ని చూసాడా అసలు? ఎందుకు చూడలేదు? చూస్తే ఎందుకు రిప్లై ఇవ్వలేదనే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ ట్రిక్ తో మీరు మళ్లీ కలుసుకునే ఛాన్స్ ఉంది.

అందంగా కనిపించండి: మిమ్మల్ని కాదని మీ లవర్ మీకు బ్రేకప్ చెప్పాడా? దీనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందంతో మళ్లీ వారు మిమ్మల్నే కోరుకునేలా చేయొచ్చు. మీ అందం చూసి కుళ్లుకునేలా చేయాలి మీరు. జిమ్ లేదా వ్యాయామాలు చేసి అందంగా , ఫిట్ గా తయారవ్వండి. అవసరమైతే మేకప్ వేసుకుని అందంగా ముస్తాబై వారి కళ్లముందునుంచే వెళ్లండి. అలా మిమ్మల్ని చూసి వారికి మళ్లీ మీ ప్రేమ కావాలనిపిస్తుంది. కాబట్టి ఈ ట్రిక్ ను ఫాలో అవ్వండి. 
 

ఆనందంగా ఉన్నట్టు నటించండి:   మీ లవ్ దూరమైందన్న బాధను బయటకు కనిపించనివ్వకండి. ఆనందంగా ఉండండి. స్నేహితులతో కలిసి ఎటైనా వెళ్లడం లాంటివి చేయండి. ఇలాంటివి చూసినప్పుడు వారు మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అంతేకాదు ఇలాంటి పరిస్థితుల్లోనే వారు మళ్లీ మీతో ప్రేమలో పడే అవకాశం ఉంది. 

దూరంగా ఉండండి:  కొన్ని కొన్ని సార్లు ఇష్టమైన వాళ్లకు దూరంగా ఉంటేనే వారి మధ్య అంతులేని ప్రేమ పుట్టే అవకాశం ఉంది. దగ్గరగా ఉన్న కొద్దీ దూరం పెరిగిపోతూ ఉంటుంది కొంతమందిలో. కాబట్టి మీరు వారిని పట్టించుకోవడం మానేయండి. అప్పుడే వారికి మీ విలువ తెలుస్తుంది. అంతేకాదు మీ ఇద్దరికీ తెలిసిన ఫ్రెండ్స్ కు టచ్ లో ఉండకండి. మీరు వారి కంట పడకుండా చూసుకోండి. ఈ ట్రిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే మిమ్మల్ని వదిలేసిన వాళ్లు తిరిగి మిమ్మల్ని చేరుకుంటారు. మీతో మళ్లీ ప్రేమలో పడతారు

Latest Videos

click me!