turmeric side effects: కూరల్లో పసుపును ఎక్కువగా వేస్తున్నారా? అయితే ఈ జబ్బులను ఎదుర్కోకతప్పదు.. జాగ్రత్త

Published : May 01, 2022, 03:59 PM IST

turmeric side effects: పసుపు లో యాంటీ బయోటిక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. అలా అని పసుపును మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో జబ్బులను ఏరి కోరి కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

PREV
18
turmeric side effects: కూరల్లో పసుపును ఎక్కువగా వేస్తున్నారా? అయితే ఈ జబ్బులను ఎదుర్కోకతప్పదు.. జాగ్రత్త
Turmeric

మనం చేసే ప్రతి వంటలో ఏది ఉన్నా లేకున్నా.. పసుపును మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పసుపు వంటలకు మంచి కలర్ ను తీసుకురావడమే కాదు.. టేస్ట్ ను కూడా పెంచుతుంది. పసుపులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోపోషకాలుంటాయి. ఇవి మనల్ని అనేక జబ్బుల నుంచి రక్షించడమే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి. 
 

 

28

పసుపులో కాల్షియం, విటమిన్ సి, యాంటీ బయోటిక్స్, ఐరన్, క్రిమినాశక గుణాలు, సోడియం వంటి ముఖ్యమైన పోషకాలు దీనిలో అధిక మొత్తంలో ఉటాయి. ఇవన్నీ మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అలా అని పసుపును మోతాదుకు మించి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మీకు ఈ క్రింది అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

38

కిడ్నీల్లో రాళ్లు.. రకరకాల కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే పసుపు ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపులో ఉంటే ఆక్సలేట్  వల్ల కాల్షియం కరిగిపోకుండా ఉంటుంది. దీంతో కాల్షియం తొలుత ముద్దగా ఉండి.. తర్వాతి కాలంలో రాళ్లుగా ఏర్పడతాయి. అందుకే పసుపును ఎక్కువగా తీసుకోకండి. 
 

48

వాంతులు, విరేచనాలు.. పసుపులో కర్కుమిన్ అనే మూలకం వల్ల  Digestion సమస్యలు వస్తాయి. దీంతో వాంతులు , విరేచనాల సమస్యలను ఎదుర్కోవచ్చు. 

58

మధుమేహం.. డయాబెటీస్ పేషెంట్లు పసుపును మోతాదుకు మించి తీసుకోవడం అస్సలు మంచిది కాదు.  అలాగే ఆయిలీ ఫుడ్స్ కు కూడా వీరు దూరంగా ఉంటేనే ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉండదు. 

68

ఐరన్ లోపం.. పసుపును పరిమితికి మించి తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ఐరన్ పూర్తిగా లభించదు. ఒంట్లో ఐరన్ లోపిస్తే మీరు రక్తహీనత సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఐరన్ లోపంతో బాధపడేవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. 

78

ముక్కులోంచి రక్తం.. ఒంట్లో వేడిమి ఎక్కువైతే కొందరికి ముక్కులోంచి రక్తం కారుతుంది. అయితే  పసుపుకు వేడి చేసే గుణం ఉంటుంది. ఈ సీజన్ లో పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కులోంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు పసుపును మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 
 

88

కామెర్లు.. కామెర్ల సమస్యతో బాధపడేవారు పసుపుకు దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీరు పసుపును తీసుకుంటే కామెర్లు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరు పసుపును తీసుకోవాలనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.  

Read more Photos on
click me!