Anemia prevention Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ జ్యూస్ లు తాగండి..

Published : May 01, 2022, 02:12 PM IST

Anemia prevention Tips: ద్రాక్షపండు, మామిడి పండ్ల రసాలు రక్తహీనత సమస్యకు చెక్ పెడతాయి. అంతేకాదు ఈ జ్యూస్ లు మీకు శక్తిని కూడా అందిస్తాయి. 

PREV
15
Anemia prevention Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ జ్యూస్ లు తాగండి..

శరీరంలో రక్తం తగ్గినప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలా మందికి తెలియదు. కొన్నిరకాల పండ్లు, కూరగాయలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇవన్నీ అందరూ పాటించకపోవచ్చు. అలాంటి వారు ఈ నాలుగు రకాల జ్యూస్ లు తాగితే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. 
 

25

ద్రాక్ష జ్యూస్.. ద్రాక్ష మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు హిమోగ్లోబిన్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ద్రాక్షను అలాగే తినొచ్చు లేదా జ్యూస్ గా చేసుకుని అందులో కాస్త ఉప్పు వేసి తాగినా రక్తహీనత సమస్య తొలగిపోతుంది. 

35

అలొవెరా జ్యూస్.. కలబంద జ్యూస్ మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇది జట్టుకే కాదు చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ గ్లాస్ కలబంద జ్యూస్ ను తాగడం వల్ల ఒంట్లో రక్తం శుభ్రపడటంతో పాటుగా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

 

45

మ్యాంగో జ్యూస్.. మామిడి పండ్లు తింటే ఒంట్లో రక్తంపెరగుతుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. అందులోనూ మామిడి పండ్లు సులభంగా లభిస్తాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు మామిడి పండ్లను లేదా మామిడి పండ్ల రసాన్ని తాగండి. 

55

బీట్ రూట్ జ్యూస్.. బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రక్తం తగ్గిన వారు వైలైనంత ఎక్కువగా బీట్ రూట్ జ్యూస్ ను  తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. బీట్ రూట్ జ్యూస్ ను అలాగే తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని జ్యూస్ గా చేసుకుని తాగండి. తరచుగా ఈ పండ్ల రసాలను తాగడం వల్ల ఒంట్లో రక్తం పెరుగుతుంది.  

click me!

Recommended Stories