cancer risk: క్యాన్సర్ రాకూడదంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..

Published : May 01, 2022, 02:55 PM IST

cancer risk:  ప్రాణాంతక రోగాల్లో క్యాన్సర్ ముందుంది. దీనిబారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స లేనేలేదు. అయితే మన లైఫ్ స్టైల్ లో కొన్ని రకాల మార్పులు చేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.   

PREV
17
cancer risk: క్యాన్సర్ రాకూడదంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..

ఎత్తుకు తగ్గ బరువు.. మీ శరీర బరువును మీ ఎత్తుకు, వయసుకు తగ్గట్టుగా మెయిన్ టెయిన్ చేసినట్టైతే క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గించుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

27

ఫిజికల్ యాక్టివిటీ.. ప్రస్తుత ఉరుకుల పరుగుల లైఫ్ లో చాలా మందికి ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనే సమయమే ఉండటం లేదు. కానీ ప్రతిరోజూ 15 నుంచి 30 నిమిషాల పాటైనా ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

37

ప్రాసెస్డ్ ఫుడ్.. ఇంటి ఆహారానికి బదులుగా ప్రాసెస్డ్ ఫుడ్ ను తిన్నారో.. మీరు క్యాన్సర్ కు వెల్కమ్ చెప్పినవారవుతారు. అవును ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తింటే క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి వీటిని తినడం వీలైనంత తొందరగా మానుకోండి. 

47
Alcohol

ఈ అలవాట్లను మానుకోండి.. డ్రింకింగ్ , స్మోకింగ్ మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటికి తోడు మోతాదుకు మించి ఉప్పును తీసుకుంటే కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తగ్గింస్తేనే మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

57

తల్లిపాలు.. తల్లిపాలు పిల్లలను ఎన్నో రోగాలనుంచి రక్షిస్తాయి. అందుకే పసి పిల్లలకు ఆరు నెలల దాకా తల్లిపాలే పట్టించాలి. లేదంటే పిల్లల్లో ఎన్నో లోపాలు వచ్చే అవకాశం ఉంది. తల్లిపాలు పిల్లలు పుష్టిగా ఎదిగేందుకు, క్యాన్సర్ నుంచి రక్షించేందుకు ఎంతో సహాయపడతాయి. 

67

ఎండలో.. ఎండ మన శరీరానికి అవసరం. ఎండలో ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. అయితే ఎక్కువ సేపు ఎండలో ఉంటే మాత్రం చర్మ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో ఉండాలనుకుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం ఉండండి.  
 

77

ట్యాబ్లెట్స్.. అయిన దానికి కానిదానికి అంటూ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు ట్యాబ్లెట్లను వేసుకున్నట్టైతే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 
 

click me!

Recommended Stories