ఉబ్బిన కళ్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ అద్బుత చిట్కాలు మీ కోసమే..

Published : Feb 19, 2022, 12:50 PM IST

ఏదైనా చెప్పడానికి నోరే కావాలా.. అందమైన కళ్లుంటే చాలదా..  అని చాలా మంది అంటుంటారు. ఇది మాత్రం నిజమే మరి.  నోటితో చెప్పలేని ఎన్నో విషయాలను, విశేషాలను కళ్లతో చెప్పొచ్చు. అయితే కొంతమందికి ఉదయం లేవగానే కళ్లు ఉబ్బి పోయి ఉంటాయి. నిద్రపోకపోవడం, ఏడవడం, నీళ్ల కొరత వంటి అనేక కారణాల వల్ల కళ్లు అలా ఉబ్బిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి చక్కటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
19
ఉబ్బిన కళ్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ అద్బుత చిట్కాలు మీ కోసమే..

అందమైన కళ్లతో ఎన్నో విషయాలను ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి మనకు నిజం చెప్తున్నాడా? లేక అబద్దం చెప్తున్నాడో అతని కళ్లను బట్టే తెలుసుకోవచ్చట. ఇకపోతే కళ్లు అందమైనవి, ఆకర్షణీయమైనవే కాదు.. మనకు ఎన్నో ఊసులను కూడా చెప్తాయి. అంతేకాదు ఎన్నో భావోద్వేగాలను వీటి ద్వారానే తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడా? బాధలో ఉన్నాడా వంటి వాటిని కళ్లను బట్టే తెలుసుకోవచ్చు.

29

అందమైన కళ్లు చాలు ఇతరులను మన వైపు ఆకర్షించడానికి. కాగా అమ్మాయిలు తమ అందమైన కళ్లు మరింత అందంగా మారాలని వివిధ రకాల మేకప్ లు గట్రా వేస్తుంటారు. మీకు తెలుసా.. కళ్లు ఆరోగ్యంగా ఉంటేను మీ కళ్లు అందంగా కనిపిస్తాయి. అంతేకాని మేకప్ వేస్తే కాదు. ఒకవేళ మీ కళ్లు ఉబ్బిపోయి ఉంటే మీరెంత మేకప్ వేసినా.. మీరు అందంగా కనిపించరు. ఉబ్బిన కళ్లను మామూలుగా చేయడానికి కొన్ని చిట్కాలను తప్పకపాటించాల్సిందే.  

39

రాత్రంతా సరిగ్గా నిద్రపోకపోవడం, ఏడవడం, శరీరానికి సరిపడా నీళ్లను తాగకపోవడం, ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం, వివిధ అలర్జీలు, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, మేకప్ ను సరిగ్గా రిమూవ్ చేయకపోవడం వంటి కారణాల వల్ల కళ్లు ఉబ్బుతుంటాయి. ఉబ్బిన కళ్లతో బాధపడేవారికి  ప్లాంటాస్‌లోని చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ మధుమితా ధర్ అద్బుత చిట్కాలను సూచించారు. ఆ చిట్కాలతో ఉబ్బిన కళ్లకు చెక్ పెట్టొచ్చట. 
 

49

ప్రోటీన్లు, విటమిన్లు, పొటాషియం ఆకు కూరలు, పెరుగు, అరటిపండ్లలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. వీటితో కళ్లు సాధారణ స్థితికి రావడమే కాదు.. కళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.

59

ఐస్ క్యూబ్స్ లేదా, టీ బ్యాగ్ లతో కూడా కళ్లను సాధారణ స్థితికి తీసుకురావొచ్చు. అలాగే దోసకాయ లేదా బంగాల దుంప ముక్కలను కళ్లపై పెట్టుకున్నా కళ్లు మామూలుగా అవుతాయి.

69

కళ్ల ఆరోగ్యానికి కంటినిండా నిద్ర అవసరం. ప్రతి రోజూ ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోతే చాలు ఎటువంటి సమస్యలను మీరు ఫేస్ చేయాల్సిన అవసరం రాదు. 

79

 బాడీ డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే ప్రతి రోజూ సుమారుగా 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లను సరిపడా తాగకపోతే బాడీ డీ హైడీహైడ్రేట్ అయ్యి చర్మం జీవం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. సరిపడా నీళ్లను తాగితే బొద్దుగా ముద్దుగా కనిపిస్తారు.

89

ఐస్ క్యూబ్స్ లేదా, టీ బ్యాగ్ లతో కూడా కళ్లను సాధారణ స్థితికి తీసుకురావొచ్చు. అలాగే దోసకాయ లేదా బంగాల దుంప ముక్కలను కళ్లపై పెట్టుకున్నా కళ్లు మామూలుగా అవుతాయి.
 

99

ఆల్కహాల్ ఆరోగ్యానికే కాదు చర్మాన్ని కూడా హాని కలిగిస్తుంది. దీన్ని తరచుగా సేవించడం వల్ల చర్మం డల్ గా మారుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తూ మన జీవన శైలిలో మార్పులను చేసుకుంటే ఎన్నో సమస్యలను దరిచేరకుండా చూడొచ్చు.
 

Read more Photos on
click me!

Recommended Stories