Lemon Slices : సిట్రస్ ఫ్రూట్ అయిన నిమ్మకాయలో ఎన్నో దివ్య ఔషదగుణాలున్నాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇది కమ్మని వాసనను ఇవ్వడమే కాదు.. వివిధ ఆహారాల్లో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ప్రతి వంటగదిలో నిమ్మ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. నిమ్మపండులో విటమిన్ బి, సి, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్, పాస్పరస్ మెండుగా ఉంటాయి.