గురకతో నిద్ర రావడం లేదా? అయితే దానికి ఇలా చెక్ పెట్టండి..

First Published Jan 18, 2022, 12:56 PM IST

Snoring: ప్రస్తుతం చాలా మంది గురక సమస్యతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా రాదు. ఈ సమస్య పురుషుల్లోనే వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ మహిళల్లో కూడా ఈ సమస్య వస్తుంటుంది.  అయితే ఈ గురక వల్ల గురక పెట్టే వారు బాగానే నిద్ర పోతారు కానీ అవతలి వారికి తెల్లవార్లూ జాగారమే అవుతుంది. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..
 

Snoring: గురక ఈ సమస్యతో సతమతవయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్య ఎక్కువగా Smoking, మద్యపానం, అలెర్జీలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సైనస్ సమస్య, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలోనే కనిపిస్తుందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. వీటితో పాటుగా గురక పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇలా రాత్రుళ్లంతా గురక పెట్టడం వల్ల వారి నిద్రకు భంగం కలుగుతుందో లేదో కానీ.. చుట్టు పక్కల పడుకున్న వారి నిద్రకు ఖచ్చితంగా భంగం కలుగుతుంది. గురక చేసే శబ్దంతో ప్రశాతంగా పడుకోలేరు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మందులను, రకరకాల ఉత్పత్తులను చాలా మంది వాడుతూ ఉంటారు. మెడిసిన్స్ కాకుండా.. ఇంట్లో లభించే వాటితోనే ఈ గురక(Snoring) సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం.
 

గురక రాకుండా చేయడంలో వెల్లుల్లి బెస్ట్ మెడిసిన్ లా ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. గోరు వెచ్చని నీళ్లలో ఈ వెల్లుల్లిని కలిపి రాత్రులు తాగడం అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే గురుక సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆరోగ్యానికి పసుపు ఎంత మేలు చేస్తోందో మనకు తెలిసిన విషయమే.  Antibacterial గుణాలను కలిగున్న పసుపు చర్మ సంరక్షణకు కూడా ఉంతో ఉపయోగపడుతుంది. ఇకపోతే గురక తగ్గాలంటే.. పాలల్లో  పసుపు కలుపుకుని రాత్రుళ్లు తాగాలి. ఈ పసుపు పాలు తాగడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవు. దీని వల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది. ముఖ్యంగా గురక పెట్టే అవకాశమే ఉండదు. 

. గురకకు చెక్ పెట్టడంలో పుదీనా కూడా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా నీళ్లను తీసుకుని వాటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత కిందికి దించి చల్లారిన తర్వాత తాగాలి. తాగాలనిపించకపోతే నోటిలో వేసుకుని పుక్కిలించినా మంచిదే. ఇలా చేయడం వల్ల గురక సమస్య మెల్లి మెల్లిగా దూరం అవుతుంది. 
 

 గురకను దరిచేరకుండా చేయడంలో ఆలివ్ ఆయిల్ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు డ్రాప్స్ ఆలివ్ అయిల్ ను ముక్కులో వేసుకుంటే సరి. శ్వాస మెరుగ్గా ఉంటుంది.  అలాగే ఆలివ్ ఆయిల్ ను కొన్ని చుక్కలు ఇలా ముక్కులో వేసుకుంటే గురక కూడా వచ్చే సమస్య చాలా వరకు తగ్గుతుంది. 

ముక్కు శుభ్రంగా లేకపోయినా, ముక్కు మూసుకుపోవడం వల్ల కూడా గురుక వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అందుకే ముక్కును ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ముక్కును శుభ్రం చేయడానికి ఆవు నెయ్యి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. పడుకునే ముందు గోరువెచ్చగా చేసిన కొన్ని చుక్కల నెయ్యిని ముక్కులో వేసుకుంటే గురక సమస్య తగ్గుతుందని తెలుపుతున్నారు. 
 

click me!