Better Sleep: రాత్రి మంచి నిద్ర పట్టాలంటే ఇదొక్కటి తినండి..ఉదయానికి ఫ్రెష్ గా ఉంటారు

Published : Oct 01, 2026, 02:25 PM IST

Better Sleep: పడుకున్నా నిద్ర పట్టడం లేదా? రాత్రంతా మెలకువతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ వంటింట్లోనే ఉండే ఈ ఫుడ్ మీ నిద్ర నాణ్యత మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అదెంటో తెలుసా?

PREV
15
హాయిగా నిద్ర పడుతుంది

రాత్రి పడుకున్నా నిద్ర పట్టకపోవడం.. మధ్యలో పదేపదే మెలకువ రావడం.. ఉదయం లేచేసరికి కూడా అలసటగా అనిపించడం.. ఇలా నిద్రలేమితో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారికి డైట్ లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు...మెరుగైన నిద్ర పడుతుంది.

25
పరిశోధనలో తేలిందేంటంటే..?

2026లో Frontiers in Nutrition జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనను 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సున్న 175 మంది పెద్దవాళ్లపై నిర్వహించారు. వీరంతా తమకు సరిగ్గా నిద్ర పట్టడం లేదని బాధపడేవారే. పరిశోధనలో పాల్గొన్నవారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌కు రోజుకు 60 గ్రాముల బాదం.. అంటే సుమారు 50 బాదం పప్పులు ఇచ్చారు. మరో గ్రూప్‌కు దానికి సమానమైన కేలరీలు ఉండే ఖాక్రా, చివ్డా, క్రాకర్స్ వంటివి ఇచ్చారు.

20 వారాల తర్వాత బాదం తిన్నవారు నిద్ర నాణ్యత మెరుగుపడినట్లు స్వయంగా వెల్లడించారు. త్వరగా నిద్రలోకి జారుకున్నారట. అదే సమయంలో స్లీప్ ఎఫిషియెన్సీ కూడా పెరిగింది. రాత్రి మధ్యలో మెలకువ రావడం తగ్గింది. అయితే అందరిలోనూ ఇదే ఫలితం కనిపించలేదని పరిసోధకులు తెలిపారు.

35
బాదంలో ఉన్న పోషకాలు కారణమా?

బాదం పప్పుల్లో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం సాధారణ నాడీ వ్యవస్థ, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ట్రిప్టోఫాన్‌ను శరీరం సెరోటోనిన్, మెలటోనిన్ వంటి సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తుంది. ఇవన్నీ మంచి నిద్రకు ఉపయోగపడతాయి. అయితే బాదం తింటే నిద్ర సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని కాదు. బాదం తీసుకున్నవారిలో నిద్రలేమి సమస్యలు తగ్గాయని గుర్తించారు.

45
నిద్రను రెండు విధాలుగా అంచనా

ఈ పరిశోధనలో నిద్రను రెండు విధాలుగా అంచనా వేశారు. మొదట పాల్గొన్నవారు తమ నిద్ర గురించి వివరించారు. మరోవైపు రాత్రిపూట పాలిసోమ్నోగ్రఫీ (PSG) ద్వారా కూడా నిద్రను పరిశీలించారు. నిద్ర సమయంలో శరీరంలో జరిగే వివిధ మార్పులను కొలిచే ఈ విధానాన్ని నిద్ర అధ్యయనాల్లో పరిగణిస్తారు. అందువల్ల కేవలం వ్యక్తులు చెప్పినవే కాకుండా నిద్రకు సంబంధించిన శారీరక పరిస్థితి కూడా పరిశీలించారు.

55
వైద్యులను సంప్రదించడం మంచిది

ఒకవేళ నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటే డాక్టర్లను సంప్రదించడం మంచిది. పైన చెప్పింది కేవలం అవగాహన కోసం మాత్రమే. బాదం పప్పులు తిన్నంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పలేం. ఒక అధ్యయనంలో బాదం పప్పులు తిన్న వారికి మెరుగైన నిద్ర పట్టినట్లు గుర్తించడం మాత్రమే జరిగింది.

Read more Photos on
click me!

Recommended Stories