Fish: ఈ చేప తన పిల్లలు నోట్లోనే దాచి మరీ పెంచుకుంటుంది.. ఎందుకో తెలుసా?

Published : Oct 01, 2026, 01:38 PM IST

Fish: ప్రపంచంలో అన్ని చేపలు.. గుడ్లు పెట్టేసి వదిలేస్తాయి. కానీ, ఒకే ఒక్క చేప మాత్రం.. తన పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అది కూడా తన నోట్లోనే దాచి మరీ పెంచుకుంటుంది. ఆ చేప ఏదో తెలుసా?

PREV
12
పిల్లలపై తల్లి చేప ప్రేమ..

చేపలు సాధారణంగా గుడ్లు పెట్టే జీవి. అది గుడ్లు పెట్టి వదిలేస్తుంది. కానీ, కొన్ని చేపలు మాత్రం తమ పిల్లలను కాపాడుకోవడానికి చాలా విచిత్రమైన పద్ధతిని అనుసరిస్తాయని మీకు తెలుసా? ముఖ్యంగా.. తమ నోట్లోనే పిల్లలను పెంచుతాయి. అసలు చేపలు తమ పిల్లలను నోట్లో ఎలా పెంచుతాయి? అలా పెంచాల్సిన అవసరం ఏం ఉంటుంది?

నోట్లోనే పిల్లలకు రక్షణ

ఆఫ్రికాలోని సరస్సుల్లో కనిపించే కొన్ని సిచ్లిడ్ చేపలు ఈ విధానాన్ని అనుసరిస్తాయి. ముఖ్యంగా ఆడ చేపలు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని నోటిలోకి తీసుకుంటాయి. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కూడా వాటిని కొంతకాలం నోటిలోనే ఉంచుకుంటాయి. ఇలా చేయడం వల్ల చిన్న చేపలకు బయట ఉన్న ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. పెద్ద చేపలు, ఇతర జలచరాలు దాడి చేసినప్పుడు ఈ చిన్న చేప పిల్లలు తల్లి నోటిలోకి వెళ్లి దాక్కుంటాయి.

22
చేప పిల్లలు నోట్లోనే పెరుగుతాయా?

అవును.. కొంతకాలం వరకు పిల్లలు తల్లి నోటిలోనే ఉంటాయి. అయితే తల్లి వాటిని నోటిలో పెట్టుకుని ఆహారం పెట్టదు. ఈ సమయంలో తల్లి చేపకు కూడా ఆహారం సరిగా తీసుకోలేదు. నోటిలో పిల్లలను ఉంచుకున్నప్పుడు సాధారణంగా ఆహారం తీసుకోవడం పరిమితం అవుతుంది. పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు తల్లి వాటిని తన నోటిలో రక్షిస్తుంది. బయట పరిస్థితి సురక్షితంగా ఉందని భావించినప్పుడు పిల్లలను నోటి నుంచి బయటకు వదులుతుంది.

ప్రమాదం వస్తే మళ్లీ నోట్లోకే..

ఈ చేపల ప్రవర్తనలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. పిల్లలు నోటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రమాదం ఎదురైతే తల్లి చేప దగ్గరకు తిరిగి వచ్చి మళ్లీ నోటిలోకి దూరగలవు. అంటే తల్లి చేపకు నోరు కేవలం ఆహారం తీసుకునే అవయవం మాత్రమే కాదు.. కొంతకాలం వరకు పిల్లలకు సురక్షితమైన ఆశ్రయంగా కూడా పనిచేస్తుంది.

అన్ని చేపలు ఇలానే చేస్తాయా?

అయితే అన్ని సిచ్లిడ్ చేపలు ఇలా పిల్లలను నోటిలో పెంచవు. కొన్ని మాత్రమే ఇలా చేస్తాయి. కొన్ని జాతుల్లో ఆడ చేపలు ఈ బాధ్యత తీసుకుంటే, మరికొన్ని జాతుల్లో మగ చేపలు కూడా పిల్లలను నోటిలో రక్షిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories