Kitchen Gadget: చిప్స్ ప్యాకెట్, ఫ్రోజెన్ ఫుడ్ ప్యాకెట్స్ సగం వాడి అలానే వదిలేస్తుంటారు. కొందరు క్లిప్ పెట్టేస్తారు. దానివల్ల కొన్ని గంటలకే క్రిస్పీనెస్ తగ్గి మెత్తబడిపోతాయి. దానికి పరిష్కారమే ఈ కిచెన్ గ్యాడ్జెట్. కేవలం రూ.239కే దొరికేస్తుంది.
చిప్స్, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్, అప్పడాలు, పప్పులు, ఫ్రోజెన్ వెజిటబుల్స్.. ప్యాకెట్ ఓపెన్ చేసి సగం వాడి ప్యాకెట్ క్లోజ్ చేయకుండా ఉంచితే రుచి, క్రిస్పీనెస్ తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా మెత్తబడుతుంది. మళ్లీ క్లిప్స్ తో టక్ చేసినా అవి జారిపోయి లోపల ఉన్న ప్రొడక్టు పాడవుతుంది. అలా అని వాటిని డబ్బాల్లో వేసి మూత పెట్టలేం. ప్రతి ఇంట్లో ఇది ఎదురయ్యే సమస్యే. పిల్లలు చిప్స్, డ్రై ఫ్రూట్స్ తిని అలానే పక్కనే పడేస్తారు. మరోసారి తినేసరికి అవి మెత్తగా అయి తినే పరిస్థితిలో ఉండవు. సో అవి చెత్తబుట్టలో పడేయడమే. దానికి చక్కటి పరిష్కారమే ఈ కిచెన్ గ్యాడ్జెట్. కేవలం రూ.299కే దొరికేస్తుంది.
దీన్ని టు ఇన్ వన్ బ్యాగ్ సీలర్, కట్టర్ అంటారు. చూడటానికి చిన్నగా ఉండే ఈ పరికరం.. ప్యాకెట్లను మళ్లీ సీల్ చేయడంతో పాటు కొత్త ప్యాకెట్లను ఓపెన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
26
ప్రీహీటింగ్ అవసరం లేదు
ఈ గ్యాడ్జెట్‌లో మరో ప్రత్యేకత ప్రీహీటింగ్ అవసరం లేకపోవడం. ఆన్ చేసిన తర్వాత దాదాపు సెకనులోనే సీలింగ్ ప్రారంభించవచ్చని తయారీదారు చెబుతున్నారు. ప్యాకెట్ అంచుపై సరిగ్గా జరిపితే సుమారు 5 సెకన్లలో సీల్ చేయొచ్చని పేర్కొంటున్నారు.
అయితే ప్యాకెట్ మందం, మెటీరియల్‌ను బట్టి సీలింగ్ మారొచ్చు. ముఖ్యంగా పల్చని ప్లాస్టిక్ ప్యాకెట్లపై ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్యాకెట్ మెటీరియల్‌ను బట్టి వాడాలి.
36
కట్టర్ కూడా ఇందులోనే..
ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకత కేవలం సీలింగ్ మాత్రమే కాదు. మరో వైపు చిన్న బ్లేడ్ ఉండటంతో కొత్త ప్యాకెట్లను కూడా ఓపెన్ చేయవచ్చు. ఇక కత్తెర కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. కొన్ని మోడల్స్ వెనుక భాగంలో మాగ్నెట్ కూడా ఉంటుంది. దీంతో ఉపయోగించిన తర్వాత ఫ్రిజ్‌కు అంటించి పెట్టుకోవచ్చు. కిచెన్‌లో చిన్న గ్యాడ్జెట్ల కోసం ప్రత్యేకంగా డ్రాయర్‌లో స్థలం కేటాయించాల్సిన అవసరం ఉండదు.
ముందుగా సీల్ చేయాల్సిన ప్యాకెట్ అంచును సరిగ్గా ఉంచాలి. గ్యాడ్జెట్‌ను ఆ అంచుపై సెట్ చేసి నెమ్మదిగా ఒక వైపు నుంచి మరో వైపుకు జరపాలి. హీటింగ్ ఎలిమెంట్ ప్లాస్టిక్‌ను కలిపి సీల్ చేస్తుంది. అయితే చాలా పల్చని ప్లాస్టిక్ ప్యాకెట్లపై ఉపయోగించేటప్పుడు కొంత ప్రాక్టీస్ అవసరం కావచ్చు. వేగంగా జరిపితే సీల్ కాకపోవచ్చు. ఎక్కువసేపు ఒకే చోట ఉంచితే ప్యాకెట్ కాలిపోయే ప్రమాదం ఉంది.
56
400mAh రీచార్జబుల్ బ్యాటరీ
ఈ గ్యాడ్జెట్‌లో 400mAh రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. సాధారణంగా పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 2.5 గంటల సమయం పడుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 10 నుంచి 15 రోజుల వరకు పనిచేస్తుంది. USB Type-C కేబుల్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా డిస్పోజబుల్ బ్యాటరీలు కొనాల్సిన అవసరం ఉండదు.
66
ఇంట్లో రోజూ ఉపయోగపడుతుందా?
చిప్స్, నట్స్, డ్రై ఫుడ్ లేదా పెట్ ఫుడ్ వంటి వాటిని ఒకేసారి వాడలేం. అందువల్ల మిగతావి పాడవకుండా ఉండాలంటే ఈ గ్యాడ్జెట్ ను ఉపయోగించవచ్చు. సో ప్యాకెట్ ఎక్స్ పైరీ డేట్ కూడా చూసుకోవాలి. సీల్ వేశాం కదా అని ఫుడ్ పాడవకుండా ఉంటుందని అనుకోకూడదు.