
పండగరోజు...ఇంట్లో బుజ్జి పాపాయిలు పట్టు లంగా జాకెట్ వేసుకుని తిరుగుతుంటే ఎంత బాగుంటుందో కదా. అయితే సంప్రదాయంతో పాటు ట్రెండీగా రెడీ చేయాలనుకుంటే ఈ న్యూ డిజైన్ పట్టుపరికిణీలు ట్రై చేయండి. చూడముచ్చటగా ఉంటారు. రంగురంగుల పట్టు బట్టలతో, ఆకట్టుకునే డిజైన్లతో మీ బుజ్జి పాపలను దేవతల్లా మార్చే అద్భుతమైన పట్టు పరికిణీ కలెక్షన్స్ ఇవి.
ఈ డ్రెస్‌లో స్లీవ్‌లెస్ బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా ఉంది. మెడ దగ్గర రౌండ్ నెక్ డిజైన్ ఇచ్చి, అంచుల వెంబడి చిన్న పూసలు పెట్టారు. భుజాలకు ఇరువైపులా పూల ఆకారంలో క్లాత్‌ను కుచ్చులుగా చేసిన 3D ఫ్రిల్ డిజైన్ డ్రెస్‌కు వెరైటీ లుక్ ఇస్తుంది.
పరికిణీలో ఒత్తుగా కుచ్చులు ఇచ్చి, కింద వైపు వెడల్పాటి జరీ బార్డర్ వేశారు. నడుము దగ్గర తాడు కట్టుకునే డిజైన్ ఉండటంతో డ్రెస్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ట్రెడిషనల్ పట్టు పరికిణీకి అందమైన ఫ్రిల్ డిజైన్ జతచేయడం వల్ల పిల్లలకు క్యూట్ లుక్ వస్తుంది.
సీతాకోకచిలుక రెక్కలను గుర్తుచేసే అందమైన నెక్ డిజైన్, గ్రాండ్ జరీ వర్క్‌తో ఉన్న పఫ్ స్లీవ్స్ ఈ డ్రెస్‌కు హైలైట్. గొడుగులా విచ్చుకునే పట్టు పరికిణీ కుచ్చులు, ముందు వైపు ఆకట్టుకునే అలంకరణలు అద్భుతంగా ఉన్నాయి. ట్రెడిషనల్, మోడ్రన్ స్టైల్స్ కలిసిన ఈ డ్రెస్ బుజ్జి పాపలను మరింత అందంగా చూపిస్తుంది.
సాంప్రదాయ పట్టు పరికిణీ అందాన్ని పెంచేలా సింపుల్ బ్లౌజ్ డిజైన్, అందమైన బార్డర్ వర్క్, గొడుగులా విచ్చుకునే కుచ్చులు ఈ డ్రెస్‌లో ఉన్నాయి.
బ్లౌజ్ నెక్ రౌండ్ షేప్‌లో సింపుల్‌గా డిజైన్ చేశారు. స్లీవ్‌లెస్ మోడ్రన్ డిజైన్, నడుము దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఫిట్టింగ్ బ్లౌజ్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి.
క్రాస్ షేప్‌లో ఉన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్, ముందు వైపు కట్టుకునే తాడు డిజైన్ పిల్లలకు క్యూట్ ప్రిన్సెస్ లుక్ ఇస్తాయి. కంచి పట్టు చీర డిజైన్‌ను గుర్తుచేసే ఈ పరికిణీ సెట్ చిన్న పిల్లలకు అందమైన ఎత్నిక్, మోడ్రన్ లుక్ ఇస్తుంది.
స్లీవ్‌లెస్ బ్లౌజ్ డిజైన్, భుజాలను అందంగా చూపే నీట్ కట్, మెడ చుట్టూ పూసల అలంకరణతో ఈ బ్లౌజ్ చాలా వెరైటీగా ఉంది. ముందు వైపు పూలు, ఆకుల డిజైన్‌తో ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ డ్రెస్‌కు మరింత అందాన్ని తెచ్చింది.
బ్లౌజ్ కింద వైపు వంపులతో ఉన్న డిజైనర్ బార్డర్ అద్భుతంగా ఉంది. దీనికి తోడు సాంప్రదాయ జరీ వర్క్‌తో గొడుగులా విచ్చుకునే పరికిణీ కుచ్చులు పిల్లలకు మోడ్రన్, ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
అందమైన స్క్వేర్ నెక్ డిజైన్‌తో పాటు గోల్డెన్ జరీ బార్డర్ ఈ డ్రెస్‌కు హైలైట్. మెడ దగ్గర తాడు కట్టుకునే హాల్టర్ స్టైల్ డిజైన్ సాంప్రదాయాన్ని, మోడ్రన్ లుక్‌ను కలుపుతుంది.
భుజాల దగ్గర ఉన్న తాళ్లు, జరీ బార్డర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్లీవ్‌లెస్ మోడల్లో అందమైన షోల్డర్ డిజైన్, గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో మీ బుజ్జి పాపకు సరిపోయే రాయల్ పట్టు పరికిణీ డిజైన్ ఇది.
ఈ డ్రెస్‌లో కాలర్ ఉన్న కోట్ స్టైల్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ డిజైన్ చాలా వెరైటీగా ఉంది. మెడ దగ్గర వెడల్పాటి V షేప్‌లో ఉన్న కాలర్, దానికి ఇరువైపులా రాళ్లు, పూసలతో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ రాయల్ లుక్ ఇస్తాయి.
భుజాల దగ్గర చిన్న కాలర్ లాంటి డిజైన్, ముందు వైపు కోట్ వేసుకున్నట్లు ఉండే మోడల్ ఈ బ్లౌజ్‌కు మోడ్రన్ లుక్ తెచ్చాయి. నడుము దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బ్లౌజ్‌కు ఒత్తైన కుచ్చులు ఉన్న పరికిణీని జతచేశారు.
సాంప్రదాయ పట్టు పరికిణీకి కోట్ స్టైల్ బ్లౌజ్ జతచేయడంతో పండుగ రోజుల్లో పిల్లలు వేసుకోవడానికి ఈ డిజైనర్ డ్రెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది.
సాంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇస్తూ రూపొందించిన ఈ డిజైన్లు ప్రతి చిన్నారికి ప్రిన్సెస్ లుక్ ఇస్తాయి. ఈదసరాకి మీ పిల్లల చిరునవ్వుతో పాటు వాళ్లు వేసుకునే పట్టు పరికిణీ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతుంది.