గుజరాత్ లోని గొండాల్ లో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

Navya G   | Asianet News
Published : Jan 22, 2022, 05:39 PM IST

గొండాల్ (Gondal) అనే పట్టణం గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఉంది. స్వతంత్రం రాకముందు ఈ పట్టణం గొండాల్ రాజుల పరిపాలనలో ఉండేది. ఈ పట్టణాన్ని తకోరే శ్రీ కుమ్భోజిల్, మెరమంజిలు క్రీ.శ. 1643 వ సంవత్సరంలో స్థాపించారు. అనంతరం ఈ పట్టణం సర్ భగవత్ సిన్ఘ్జి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రాజుకి కార్లంటే అమితమైన ఇష్టం. కనబడిన ప్రతి కారును కొనుగోలు చేస్తూ తన రాజ్యంలో ఉంచేవారు. ఈ కార్ల సేకరణనే నేడు గొండాల్ ప్రాంతానికి గుర్తింపుతో పాటు పర్యాటక ఆకర్షణగా తెచ్చిపెట్టింది. ఇక ఈ ఆర్టికల్ ద్వారా గొండాల్ లో సందర్శనకు వీలుగా ఉన్న అద్భుతమైన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం..  

PREV
16
గుజరాత్ లోని గొండాల్ లో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

గొండాల్ లో అనేక పర్యాటక ప్రదేశాలు (Tourist places) ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను (Specialization) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. గొండాల్ లో ప్రధాన ఆకర్షణీయ ప్రదేశాలుగా  అక్షర్ మందిర్, నవలోఖ ప్యాలెస్, రివర్సైడ్ ప్యాలెస్, రాయల్ గ్యారేజీలు ఇలా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి అందమైన వాతావరణం, మైదానాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. 
 

26

అక్షర్ మందిర్: గొండాల్ లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో అక్షర్ మందిర్ (Akshar Mandir) ఒకటి. ఈ ఆలయాన్ని స్వామి గునతితనంద్ (Swami Gunatitanand) కి అంకితమిస్తూ నిర్మించబడినది. అక్షర్ దేరి, స్వామి వారి సమాధులు లోపల ఉన్నాయి. ఈ మందిరాన్ని సందర్శించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
 

36

నవలోఖ ప్యాలెస్: గొండాల్ లో ఉన్న అతి పురాతన ప్యాలెస్లలో నవలోఖ ప్యాలెస్ (Navalokha Palace) ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ ప్యాలెస్ క్రీ.శ. 17 వ శతాబ్దానికి చెందినది. ఈ ప్యాలెస్ ఎంతో కళా నైపుణ్యం (Art skill) కలిగిన వారితో నిర్మించబడినది. ఈ ప్యాలెస్ ప్రాంగణంలోని బాల్కనీ, తోటలు అందమైన పచ్చటి గడ్డి మైదానాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. 
 

46

దాసి జీవన్ మందిర్: ఘోఘవదర్ (Ghoghavadar) లో దాసి జీవన్ మందిర్ (Dasi Jeevan Mandir) ఉంది. గొండాల్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరమ పవిత్రమైన ప్రదేశం సాధువు దాసి జీవన్ జన్మస్థలం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జీవన్ పుట్టినరోజు వార్షికోత్సవాన్ని తిలకించడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.
 

56

రాయల్ గ్యారేజీలు: రాయల్ గ్యారేజీలో (Royal Garages) రాయల్స్ వింటేజ్ కార్ల మనోహరమైన సేకరణ ప్రపంచ ప్రఖ్యాతి (World fame) గాంచినవి. ఈ గ్యారేజీలను సందర్శించిన అప్పటి రాజుల కాలంనాడు సేకరించిన కార్లను చూసే భాగ్యం మనకు లభిస్తుంది. గొండాల్ వెళ్ళినప్పుడు రాయల్ గ్యారేజీని తప్పక సందర్శించండి.

66

రివర్సైడ్ ప్యాలెస్: గొండాల్ లో ఉన్న ప్రధాన ఆకర్షణ ప్యాలెస్ లలో రివర్సైడ్ ప్యాలెస్ (Riverside Palace) ఒకటి. రివర్సైడ్ ప్యాలెస్ ను క్రీ.శ. 1875 వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ప్యాలెస్ ను భగవత్ సిన్హ్ జి రాజు, తన కుమారుడు యువరాజ్ భోజ్రాజి కోసం నిర్మించారు. ఈ ప్యాలెస్ అందాలు పర్యాటకుల మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను (Calmness) కలిగిస్తాయి.

click me!

Recommended Stories