Towel Hygiene Tips: మీ టవల్ ఇలా మారిందా..? వెంటనే మార్చేయాల్సిందే..!

Published : Oct 03, 2025, 05:19 PM IST

Towel Hygiene Tips: టవల్ ఎక్కువ కాలం వాడినప్పుడు అది క్రమంగా పాతబడిపోతుంది. చాలా మంది రోజూ వాడుతూ ఉంటాం కదా అని... రెగ్యులర్ గా ఉతుకుతూ ఉంటారు. కానీ... వాటిని మనం రెగ్యులర్ గా ఉతికినా కూడా... కొంత కాలం తర్వాత కచ్చితంగా మార్చేయాలి.

PREV
14
Towel Hygiene Tips

టవల్ అనేది మన రోజువారీ జీవితంలో విడదీయరాని వస్తువు. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడవడానికి, చేతులు కడిగిన తర్వాత తుడుచుకోవడానికి, కొన్నిసార్లు ఇంటి పనుల్లో కూడా టవల్ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ టవల్ ఎక్కువ కాలం వాడినప్పుడు అది క్రమంగా పాతబడిపోతుంది. చాలా మంది రోజూ వాడుతూ ఉంటాం కదా అని... రెగ్యులర్ గా ఉతుకుతూ ఉంటారు. కానీ... వాటిని మనం రెగ్యులర్ గా ఉతికినా కూడా... కొంత కాలం తర్వాత కచ్చితంగా మార్చేయాలి. ముఖ్యంగా.. మీ టవల్ ఇలా కనుక మారిపోతే... కచ్చితంగా దానిని రీప్లేస్ చేయాల్సిందే. దాని ప్లేస్ లో కొత్త టవల్ వాడాల్సిందే. లేదంటే.. మీ ఆరోగ్యానికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

24
తడి పీల్చుకోకపోవడం..

కొత్త టవల్ తేమను సులభంగా గ్రహించి శరీరాన్ని త్వరగా ఆరబెడుతుంది. కానీ పాత టవల్ మాత్రం తడి తొందరగా పీల్చుకోదు. అంతేకాదు.. పీల్చుకున్న కాస్తో కూస్తూ తడి కూడా తొందరగా పోదు. ఎక్కువ సేపు టవల్ తడిగా ఉంటుంది. దీని వల్ల ఆ టవల్ లో బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే... అలాంటి టవల్ ని కచ్చితంగా రీప్లేస్ చేయాలి.

34
దుర్వాసన రావడం

ఎంతసేపు డిటర్జెంట్ లేదా సబ్బుతో ఉతికినా కూడా టవల్‌లో ఒక ప్రత్యేకమైన వాసన మిగిలిపోతే, అది టవల్‌లో సూక్ష్మక్రిములు పెరిగినట్లు సూచిస్తుంది. ఇలాంటి టవల్ వాడటం వల్ల చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు ఇలాంటి టవల్ వాడకూడదు.

బూజు ఏర్పడటం

టవల్‌ ఎక్కువసేపు తడిగా ఉంచితే, దానిపై బూజు , ఫంగస్ ఏర్పడుతుంది. దాని నుంచి ఒక రకమైన వాసన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టవల్ వాడితే... చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 రంగు మసకబారడం

టవల్ చాలా కాలం వాడినప్పుడు దాని అసలు రంగు పోయి, మసకబారినట్టు కనిపిస్తుంది. ఇది టవల్ తన సహజ గుణాలను కోల్పోయినట్లు సూచిస్తుంది. రంగు మారిన టవల్ చూడటానికి కూడా బాగోదు.అలాంటివి వాడకపోవడమే మంచిది.

44
చిరిగిపోవడం

కాలక్రమేణా టవల్‌లో చిన్న రంధ్రాలు వస్తాయి, చివరలు చిరిగిపోతాయి. చిరిగిన టవల్ శరీరాన్ని సరిగ్గా తుడవదు, అంతేకాదు వాడే సమయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి టవల్‌లను వాడడం కన్నా పారవేయడం మంచిది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఒకే టవల్‌ను 2–3 సంవత్సరాలకు మించి వాడకూడదు.

టవల్‌ను వాడిన తర్వాత ఎప్పుడూ ఆరబెట్టాలి. తడిగా వదిలేస్తే త్వరగా పాడవుతుంది.

ప్రతి ఒక్కరికీ వేరువేరుగా టవల్ ఉండాలి. ఒకరినొకరు పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించవచ్చు.

మంచి నాణ్యత కలిగిన కాటన్ టవల్ తీసుకోవడం మంచిది.

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.... టవల్ కేవలం ఒక వస్తువు కాదు, మన శుభ్రతకు సంబంధించిన ముఖ్యమైన భాగం. పాత టవల్‌ను వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఈ సంకేతాలు కనబడగానే వెంటనే పాత టవల్‌ను పక్కన పెట్టి కొత్తది కొనండి. ఇలా చేస్తే మీరు శుభ్రతను కాపాడుకోవడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోగలరు.

Read more Photos on
click me!

Recommended Stories