Tomato: టమాట కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.. ఎందుకో తెలుసా.?

Published : Feb 22, 2025, 11:31 AM ISTUpdated : Feb 22, 2025, 02:01 PM IST

టమాట ధరలు కుప్పకూలి పోయాయి. మార్కెట్లో తక్కువ ధరకు టమాటలు లభిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే రైతులు మార్కెట్లోనే వృథాగా పడేసి వెళ్లిపోతున్నారు. అయితే ఇలా తగ్గిన ధరను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Tomato:  టమాట కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.. ఎందుకో తెలుసా.?

టమాట పండించిన రైతులు లబోదిబోమంటున్నారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్లు రైతుల పరిస్థితి ఉంది. గతంలో కిలో టమాటలు రూ. 50కి విక్రయించిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల కిలో టమాట ధర రూ. 5 పలుకుతోంది. దీంతో చేసేది ఏం లేక రైతులు కూడా ఎంతకో అంతకు విక్రయిస్తున్నారు. అయితే టమాట ధరలు ఎప్పుడూ ఇలాగే ఉండవు. కచ్చితంగా మళ్లీ పెరుగుతాయి. మరి తగ్గిన టమాట ధరలను సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ధరలు పెరిగినా బిందాస్‌గా ఉండొచ్చు. అదేలాంటే. 
 

24

టమాట ధరలు తగ్గిన ఈ తరుణంలో వాటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి.. టమాటా పౌడర్‌ తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్‌ నెలల తరబడి నిల్వ ఉంటుంది. దీంతో భవిష్యత్తులో టమాట ధరలు పెరిగినా అది మనపై ప్రభావం పడకుండా ఉంటుంది. ఇంతకీ టమాట పౌడర్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? అసలు ఈ పౌడర్‌ ఎందుకు ఉపయోగపడుతుంది. లాంటి వివరాలు మీకోసం.. 

టమాట పౌడర్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు:

* బాగా పండిన టమాటాలు

* ఉప్పు (తగినంత)

* మంచి నీరు. 
 

34

తయారీ విధానం: 

ముందుగా మీరు కొనుగోలు చేసిన టమాటలను శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. అనంతరం టమాట తొక్కను తొలగించాలి. తర్వాత టమాటను చిన్న చిన్న ముక్కులుగా కట్‌ చేసుకోవాలి. గింజలను కూడా తొలగించుకోవాలి. అనంతరం చిన్న చిన్నగా కట్‌ చేసుకున్న ముక్కలను ఎండలా బాగా ఆరబెట్టాలి. ఇలా 4 నుంచి 5 రోజుల పాటు ఆరబెట్టాలి. లేదంటే ఓవెన్‌లో కూడా డ్రై చేసుకోవచ్చు. 

కానీ ఎండలో ఆరబెడితేనే పొడి బాగా అవుతుంది. అనంతరం బాగా ఎండిన ముక్కలను మిక్సీ లేదా గ్రైండర్‌లో వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తయారైన పౌడర్‌ను గాలి చొరబడి డబ్బాల్లో లేదా గాజు సీసాల్లో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ పౌడర్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో గాలి వెల్లకుండా చూసుకోవాలి. 
 

44

ఎలా ఉపయోగించుకోవాలి.? 

టమాటను ఉపయోగించే దాదాపు ప్రతీ చోట ఈ పౌడర్‌ ఉపయోగపడుతుంది. పప్పు, సాంబార్‌, రసం వంటి వాటిలో ఈ పౌడర్‌ను కలుపుకోవచ్చు. టమాట సూప్‌, గ్రేవీ తయారీల్లో కూడా ఈ పౌడర్‌ ఉపయోగపడుతుంది. టమాట పౌడర్‌లో కాస్త కారం, ఉప్పు కలుపుకొని ఇడ్లీలపై చల్లుకొని కూడా తినొచ్చు. అంతేకాదండోయ్‌ అందానికి కూడా ఈ పౌడర్‌ ఉపయోగపడుతుంది. టమాట పౌడర్‌లో పెరుగు కలిపి ఫేస్‌ ప్యాక్‌గా అప్లై చేసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది.  టమాట పౌడర్‌ ప్యాకెట్లు బయట మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. అవి ధర ఎక్కువగా ఉంటాయి. అయితే టమాట ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఇదిగో ఇలా పొడి చేసుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే పని మొదలు పెట్టేయండి. 

click me!

Recommended Stories