Belly Fat: పొట్ట కొవ్వు కరిగిపోవాలంటే ప్రతిరోజూ ఈ టీ తాగితే చాలు.. త్వరగా స్లిమ్‌ అవుతారు

Published : May 14, 2026, 07:54 PM IST

Belly Fat: రోజూ ఉదయాన్నే కాఫీ, టీలతో రోజూ మొదలుపెడుతున్నారా? మీరు బరువు తగ్గాలనుకుంటే కిచెన్‌లో ఉన్న మూడు పదార్థాలతో చేసే ఈ స్పెషల్ టీ తాగితే చాలు. ఇది మీ బరువు తగ్గే  అవకాశాలను పెంచుతుంది. 

PREV
14
బెల్లీ ఫ్యాట్ తగ్గించే టీ

పొట్ట దగ్గర కొవ్వుతో ఇబ్బంది పడుతున్న వారు త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటారు. అది కూడా ఆరోగ్యంగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ కోరుకునేది ఒక్కటే.. ఆరోగ్యంగా, అందంగా ఉండటం. రోజంతా కూర్చొని చేసే ఉద్యోగాలు, నూనె నిండిన ఆహారాలు, ఒత్తిడి వల్ల చాలామంది బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. జిమ్‌కు వెళ్లే టైమ్ లేక, కఠినమైన డైట్ చేసే ఓపిక లేక ఎంతో మంది అలా బెల్లీ ఫ్యాట్ వదిలేస్తున్నారు. దీని వల్ల తీవ్రమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది. అలాంటి వారు ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, ఇంటి దగ్గరే తేలికపాటి వ్యాయామాలు చేస్తూ.. ప్రతి రోజూ ఇక్కడ చెప్పిన టీ తాగడం కూడా అలవాటు చేసుకోవాలి .

24
ఈ హెర్బల్ టీలే మంచివి

హెర్బల్ టీ స్పెషాలిటీ ఏంటి? రోజూ ఉదయాన్నే లేవగానే చాలామందికి కాఫీ లేదా పాలతో చేసిన టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ దానికి బదులుగ మన వంటగదిలోని దొరికే పదార్థాలతో చేసేవి ఈ హెర్బల్ టీలు.  అల్లం, నిమ్మరసం, తేనె.. ఈ మూడింటితో చేసే టీ ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

34
ఇది ఎలా పనిచేస్తుంది?

అల్లంలో ఉండే 'యాంటీ-ఆక్సిడెంట్' గుణాలు మన శరీర జీవక్రియను చురుగ్గా మారుస్తాయి. ఇది శరీరంలో వేడిని పుట్టించి, పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సాయపడుతుంది. ఇక నిమ్మరసం విషయానికొస్తే, దీనిలోని విటమిన్ సి, ఆమ్ల గుణాలు శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపి, శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. ఈ రెండింటి మిశ్రమానికి ఒక చెంచా తేనె కలిపితే, అది శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంతో పాటు తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.

44
టీ తాగితే సరిపోదు

కేవలం ఈ టీ తాగితే సరిపోదు… జీవనశైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చాలా అవసరం. ఉదయాన్నే పరగడుపున ఈ టీ తాగడం వల్ల రోజంతా మీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేసి, అనవసరంగా జంక్ ఫుడ్ తినకుండా ఆపుతుంది. ఈ హెర్బల్ టీ అద్భుతంగా పనిచేస్తుందన్నది నిజమే అయినా, ఇదేమీ మ్యాజిక్  కాదు. దీనితో పాటు రోజుకు కనీసం 20 నిమిషాల నడక లేదా వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మధుమేహం (Diabetes), రక్తపోటు (BP) లాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ టీని తాగే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories