Fish: ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే తినాల్సింది చేపలు.. మాంసం కాదు

Published : Aug 06, 2026, 11:46 AM IST

Fish:  అధిక బరువుతో బాధపడుతున్నవారికి మాంసం కన్నా చేపలే బెటర్. ఇక ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలనుకున్నా కూడా మాంసం తినడం మానేసి చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. ఒమేగా-3, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, మొక్కల ఆధారిత ఆహారంతో ఎక్కువ కాలం జీవించవచ్చు.

PREV
13
బరువు తగ్గడానికి చేపలు

అధిక బరువుతో బాధపడుతున్న వారు మాంసం తినడం మానేసి చేపలను తమ డైట్లో చేర్చుకోవాలి. మాంసంతో సంతృప్త కొవ్వు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది బరువును, చెడు కొలెస్ట్రాల్‌ను శరీరంలో పెంచేస్తుంది. కానీ చేపల్లో మాత్రం కేలరీలు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువ. అందుకే ఇది బరువును పెంచదు. పైగా ఊబకాయం ఉన్నవారిలో ఆకలిని కంట్రోల్ చేసి ఇతర ఆహారాలేవీ తినకుండా అడ్డుకుంటుంది. అలా ఆరోగ్యంగా బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది.

23
గుండె జబ్బులు, డయాబెటిస్ రిస్క్ తక్కువ

చేపలలో సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. దీని వల్ల ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.  ఊబకాయం ఉన్నవారిలో తరచుగా కనిపించే జీవక్రియ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 

ఎవరైతే మాంసం తినడం మానేసి చేపలు అధికంగా తింటారో వారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.  టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా చాలా తగ్గిపోతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది.  గుండెపోటు ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది.

33
జీవిత కాలాన్ని పెంచుతుంది

మాంసం తినేవారితో పోలిస్తే చేపలు తినేవారిలో మరణాల రేటు (Mortality Rate) తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే ఊబకాయం వల్ల వచ్చే గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు చేపల వల్ల రావు. దీని వల్ల మనిషి ఆయుష్షు కూడా పెరుగుతుంది.  

చేపలను నూనెలో డీప్ ఫ్రై చేయకుండా, ఉడకబెట్టి లేదా గ్రిల్ చేసి తింటే మంచిది. అయితే మాంసం మాత్రం పూర్తిగా మానేస్తేనే ఉత్తమం. పెద్ద చేపల్లో పాదరసం (Mercury) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, చిన్న చేపలను ఎంచుకుని వారానికి 2-3 సార్లు తినడం మంచిది. చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు కూడా తీసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories