గుండె పోటు ఇప్పుడు అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతోంది. ఎప్పుడు ఎవరికీ గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. పొగతాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే వెంటనే ధూమపానానికి దూరంగా ఉండండి.
రోజూ వ్యాయామాలు చేయండి
రోజూ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది.