ఎసిడిటీ, మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. వెంటనే ఉపశమనం పొందుతారు..

First Published Aug 20, 2022, 9:51 AM IST

ఎసిడిటీ, మలబద్దకం సమస్యలు చిన్నవిగానే కనిపించినా ఇవి పెట్టే ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. అయితే ఈ సమస్యలను కొన్ని సింపుల్ చిట్కాలతో తొందరగా తగ్గించుకోవచ్చు. 
 

కొన్ని రకాల ఆహార పదార్థాలు, పేలవమైన జీవనశైలి కారణంగా నేడు ఎంతో మంది ఎసిడిటీ, మలబద్దకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు ఎప్పుడో ఒకసారి వస్తే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ తరచుగా వేధిస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీటి గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఈ రెండింటికీ చెక్ పెట్టొచ్చు. అంతేకాదు ఇవి మీ జీర్ణవ్యవస్థను కూడా బలంగా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

లవంగాలు, యాలకులు

మలబద్దకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలను తగ్గించేందుకు యాలకులు, లవంగాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిలో ఉండే కార్మినేటివ్ లక్షణాలు యాసిడ్ రిప్లక్స్ ను మెరుగుపరుస్తాయి. ఇకపోతే కడుపులో వేడిని తగ్గించేందుకు యాలకులు ఉపయోగపడతాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమనం కూడా కలిగిస్తాయి. 
 

గోరువెచ్చని నీరు

గోరు వెచ్చని నీరు ఎన్నో వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిరూపించబడింది. అందుకే మీరు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగండి. ఇది మలబద్దకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు గోరువెచ్చని నీళ్లు జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరం నుంచి విషపదార్థాలను కూడా బయటకు పంపుతాయి. ముఖ్యంగా బాడీని హైడ్రేట్ గా ఉంచుతాయి. 

యోగాసనాలు

పుల్లని త్రేన్పులు, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని యోగాసనాలు వేస్తే ఉపశమనం లభిస్తుంది.  వీటిలో Supt Baddha Konasana వేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే Reclining bound angle అని కూడా అంటారు. ఈ ఆసనం జీర్ణవ్యవస్థ సమస్యలను తొలగిస్తుంది. 
 

అల్లం

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అల్లంతో పాటుగా పుదీనా ఆకులు, సోంపు గింజలు కూడా  పొట్టను క్లీన్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. ఇందుకోసం ఈ మూడింటినీ నీటిలో వేసి మరిగించి ఈ వాటర్ ను ఉదయం తాగండి. దీనివల్ల పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్లంలో ఉండే జింజెరోల్ అనే మూలకం ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇక సోంపు గింజలు కడుపును క్లీన్ గా ఉంచుతాయి. 
 

leafy vegetables

ఆయిలీ ఫుడ్, కారంగా ఉండే ఆహారాలను తినడం మానుకోండి

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మనం తినే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు కారం, ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినకండి. ఎందుకంటే వీటిని తినడం వల్ల ఎసిడిటీ, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మీరుతినే వంటల్లో కారాన్ని ఎక్కువగా వేయకండి. ఆకుకూరలు, పాలు, పెరుగు, కాయధాన్యాలను ఎక్కువగా తినండి. ఇవి మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎసిడిటీ సమస్య కూడా పోతుంది. 

click me!