వావ్.. పరిగడుపున క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

First Published Aug 19, 2022, 4:12 PM IST

క్యారెట్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని పచ్చిగానే తింటుంటారు. అయితే ఉదయం పరిగడుపున క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల మీరు ఊహించని లాభాలను పొందుతారు తెలుసా..?

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెరగాలని పోషకాహారాన్నే తింటున్నారు. వాటిలో క్యారెట్లు కూడా ఒకటి. క్యారెట్లలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అందుకే చాలా మంది క్యారెట్లను పచ్చిగానే తింటుంటారు. కొందరు వీటిని జ్యూస్ గా, సలాగ్ గా చేసుకుని కూడా తీసుకుంటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యారెట్ జ్యూస్ ను ఉదయం పరిగడుపున తాగితే మీరు ఊహించని విధంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

క్యారెట్లలో విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ సి లతో పాటుగా ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. దీన్ని హల్వా తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ క్యారెట్ ను సలాడ్  రూపంలో లేదా జ్యూస్ గా చేసుకోని తాగడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 

రెగ్యులర్ గా పరిగడుపున క్యారెట్ జ్యూస్ ను తాగితే మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎందుకంటే క్యారెట్లలో ఉండే గుణాలు రక్తంలో విష పదార్థాలను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీ ముఖ చర్మం ఆకర్షణీయంగా తయారవుతుంది. 

మొటిమలతో ఇబ్బంది పడేవారికి క్యారెట్ జ్యూస్ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే క్యారెట్ జ్యూస్ మొటిమలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది మొటిమల వల్ల ఏర్పడ్డ మొండి మచ్చలను కూడా తగ్గిస్తుంది.

క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మీ శరీరంలో హిమోగ్లిబిన్ పరిమాణం బాగుంటుంది. దీంతో మీరు ఊరికే అలసిపోయే అవకాశమే ఉండదు. 

కొంతమందికి ఊరికే చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంటుంది. ఇలాంటి వారు రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ ను తాగాలి. ఇది రక్తస్రావాన్ని ఆపి.. దంతాలను మెరిసేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. 

దగ్గును తగ్గించడానికి కూడా క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది. నిరంతరం దగ్గుతో బాధపడేవారు గ్లాస్ క్యారెట్ జ్యూస్ లో పంచదార, కొద్దిగా నల్లమిరియాల పొడిని కలుపుకుని తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. 

క్యారెట్లలో పుష్కలంగా ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి.. మీరు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 

click me!