Hair fall: జట్టు విపరీతంగా రాలుతోందా.? అయితే వెంటనే ఈ అలవాట్లను మానుకోండి..

Published : Apr 01, 2022, 03:38 PM IST

Hair fall : బ్రెడ్, షుగర్, ఆల్కహాల్, జంక్ ఫుడ్, డైట్ సోడా వంటివి ఎక్కువగా తీసుకున్నా జుట్టు విపరీతంగా రాలుతుంది. వీటిని వీలైనంత తొందరగా మానేస్తేనే మీజుట్టు సేఫ్ గా ఉంటుంది. లేదంటే..   

PREV
19
Hair fall: జట్టు విపరీతంగా రాలుతోందా.? అయితే వెంటనే ఈ అలవాట్లను మానుకోండి..
hair fall

 జట్టు పొడుగ్గా, షైనీగా పెరగాలని చాలా మంది యువతీ యువకులు మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలను వాడుతుంటారు. 

29
hair fall

అయితే కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. జుట్టు పొడుగ్గా, ఆరోగ్యంగా పెరగాలంటే మాత్రం తప్పనిసరిగా కొన్ని అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

39
sugar

షుగర్.. మీరు తీసుకునే ఆహారంలో షుగర్ కంటెంట్ ఎక్కువైతే మాత్రం జుట్టు విపరీతంగా రాలడం మొదలవుతుంది. కాబట్టి షుగర్ వాడకాన్ని వీలైనంత త్వరగా తగ్గించండి. 

49

చేపలు.. చేపల్లో పాదరసం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే జుట్టు విపరీతంగా రాలుతుంది. ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా కూడా చేపల్లో మిథైల్ మెర్య్కూరీ నిల్వలు ఎక్కువ అవుతున్నాయంట. కానీ సముద్ర చేపలైన టూనా చేపలో మెర్య్కూరీ ఎక్కువగా ఉన్నా.. వీటిని తింటే వెంట్రుకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచి చేస్తాయి కూడా. ఏదేమైనా మనం తీసుకునే చేపలను బట్టే ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

59

శుద్ధి చేసిన పిండి, బ్రెడ్, చక్కెరలు జుట్టు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యంగా తయారవుతాయి. దీనివల్ల ఇన్సులిన్ విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా జుట్టు దారుణంగా రాలుతుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. 

69

ఆల్కహాల్.. ఆల్కహాల్ తీసుకుంటే శరీరంలోని వివిధ భాగాలు పాడవ్వడమే కాదు జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. అంతేకాదు ఈ ఆల్కహాల్ వల్ల ప్రోటీన్లు బలహీనపడతాయి. ఈ కారణంగానే హెయిర్ ఫాల్ అవుతుంది. జుట్టు రాలకూడదంటే ఆల్కహాల్ దూరంగా ఉండాల్సిందే. 

79

డైట్ సోడా.. కృత్రిమ స్వీట్నర్ డైట్ సోడా వెంట్రుకల ఆరోగ్యానికి అస్సలు మంచిది. ఈ డైట్ సోడాను విపరీతంగా తాగడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. దాంతో జుట్టు విపరీతంగా రాలుతుంది. 

89

జంక్ ఫుడ్.. జంక్ ఫుడ్ లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటివల్ల బరువు పెరగడమే కాదు.. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంతేకాదు వీటిని ఎక్కువగా తినడం వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. దీనికి తోడు నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే కూడా మీ జుట్టు మొత్తం ఊడిపోయే ప్రమాదం ఉంది. 
 

99

గుడ్లు.. గుడ్డు సంపూర్ణ ఆహారం. వీటిలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. కానీ పచ్చిగా ఎగ్ వైట్ తీసుకుంటే బయోటిన్ అనే విటమిన్ లోపిస్తుంది. కాగా ఈ బయోటిన్ వల్లే జట్టు పెరుగుదలకు అవసరమైన కెరాటిన్ ఉత్పత్తి అవుతుంది.  కాగా పచ్చి గుడ్డు సొన తాగితే.. బయోటిన్ లోపం ఏర్పడి జట్టు విపరీతంగా రాలుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories