Diabetes: అరటిపండ్లు, దానిమ్మ పండ్లు, తెల్లని ద్రాక్ష, నల్లని ద్రాక్షపండ్లు డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేస్తాయి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ వేసవిలో ఎంచక్కా తినొచ్చు. వీటిని తింటే వారి షుగర్ లెవెల్స్ కూడా పెరగవు.
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఒక గంటపాటు బయటుంటే చాలు కండ్లు బైర్లు కమ్మేస్తున్నాయి. ఇక ఈ వేసవి కాలం డయాబెటీస్ పేషెంట్లకు మరింత కష్టంగానే ఉంటుందని చెప్పాలి. వీటిలో టైప్ 1 డయాబెటీస్ వారసత్వంగా వచ్చినా.. టైప్ 2 డయాబెటిస్ మాత్రం చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి మూలంగానే వస్తుంది.
27
ఏ కారణంగా మధుమేహం బారిన పడ్డా షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోకుంటే మాత్రం మూత్రపిండాలు మొదటగా చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే డయాబెటీస్ పేషెంట్లు వేసవిలో ఖచ్చితంగా తినాల్సిన పండ్లు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
37
అరటిపండు: అరటిపండులో (Banana) బయోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో అదనంగా పీచు, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు (Vitamins), కాపర, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది.
47
ద్రాక్షలు.. నల్లవి లేదా తెల్ల ద్రాక్షలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి. షుగుర్ పేషెంట్లు పది నుంచి పదిహేను ద్రాక్షలను తింటే షుగర్ లెవెల్స్ ఇట్టే తగ్గిపోతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
57
దానిమ్మ.. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మనల్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అందుకే ఇవి పిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఎంతో అవసరం. వీటిని ప్రతిరోజూ తింటే రక్తహీనత సమస్యే రాదు. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా తినాలి. వీటివల్ల మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
67
స్ట్రాబెర్రీలు.. కాలాలతో సంబంధం లేకుండా స్ట్రాబెర్రీలు అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి.
77
నారింజ పండు.. నారింజ పండ్ల మధుమేహులకు లాభమే తప్ప నష్టమేమీ ఉండదు. వీటిని క్రమం తప్పకుండా తింటే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ వపర్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు రోజుకు రెండు నారింజ పండ్లను తింటే మంచి మేలు జరుగుతుంది.